Mirage OTT: సడన్‌గా ఓటీటీలోకి 'దృశ్యం' డైరెక్టర్ మిస్టరీ థ్రిల్లర్ - ఈ ప్లాట్ ఫామ్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
Mirage OTT Platform: 'దృశ్యం' ఫేం జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ 'మిరాజ్' సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Asif Ali's Mirage OTT Streaming On Sonyliv: 'దృశ్యం' ప్రాంఛైజీస్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికే రెండు పార్టులు రిలీజ్ కాగా మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కించిన మరో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మిరాజ్'. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగులోనూ స్ట్రీమింగ్
'మిరాజ్' మూవీ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో ఆదివారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చినా ఒక రోజు ముందుగానే సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. 'ఉత్కంఠభరితమైన కాలాన్ని మలుపు తిప్పే రహస్యంలోకి అడుగుపెట్టండి' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది సోనీ లివ్. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ స్టార్ ఆసిఫ్ అలీ, 'ఆకాశమే హద్దురా' ఫేం అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు హన్నా రేజీ కోషి, అర్జున్ శ్యామ్ గోపన్, సంపత్, హకీమ్ షాజహాన్ కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read: 'బాహుబలి' నిర్మాతలతో 'పుష్ప' విలన్ మూవీ - బాలయ్య ఫేమస్ డైలాగ్ టైటిల్‌తో... హీరోగా తెలుగు డెబ్యూ
స్టోరీ ఏంటంటే?
కిరణ్ (హకీమ్ షాజహాన్), అభిరామి (అపర్ణ బాలమురళి) ఇద్దరూ లవర్స్. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ప్రారంభించాలని కలలు కంటుండగా... ట్రైన్ యాక్సిిడెంట్‌లో కిరణ్ చనిపోయాడంటూ అభికి పీఎస్ నుంచి కాల్ వస్తుంది. దీంతో షాక్‌కు గురవుతుంది. ఇదే టైంలో ఆమెను ఓ హార్డ్ డిస్క్ కోసం అటు పోలీసులు, ఇటు రౌడీలు ఇబ్బంది పెడుతుంటారు. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తాయి. అసలు ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? కిరణ్‌కు ఆ హార్డ్ డిస్క్‌కు సంబంధం ఏంటి? అసలు కిరణ్ నిజంగా ట్రైన్ యాక్సిడెంట్‌లోనే చనిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అందరి బెదిరింపుల నుంచి తనను తాను ఎలా కాపాడుకుంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















