Fahadh Faasil Movie Update: 'బాహుబలి' నిర్మాతలతో 'పుష్ప' విలన్ మూవీ - బాలయ్య ఫేమస్ డైలాగ్ టైటిల్‌తో... హీరోగా తెలుగు డెబ్యూ
Fahadh Faasil: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు ఫస్ట్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 'బాహుబలి' మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

Fahadh Faasil Movie With Baahubali Makers: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ఫ్రాంచైజీలో విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్. తెలుగులో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ భారీగానే ప్లాన్ చేశారు. ఏడాది క్రితమే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేయగా... తాజాగా షూటింగ్ ప్రారంభమైంది.
బాలయ్య ఫేమస్ డైలాగ్... అదిరిపోయే టైటిల్
'ఫహాద్ ఫాజిల్' హీరోగా ఫస్ట్ తెలుగు మూవీకి గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఫేమస్ డైలాగ్ ఫిక్స్ చేయడం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన 'శ్రీమన్నారాయణ' మూవీలోని 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' అనే టైటిల్‌ను లాక్ చేశారు. 2024 మార్చి 24న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా... శశాంక్ యేలేటి దర్శకత్వం వహించనున్నారు. ఆయనకు కూడా ఇదే ఫస్ట్ మూవీ. వినోదం, థ్రిల్, ఎమోషన్ అన్నీ కలిగలిపి ఓ కంప్లీట్ ఫాంటసీ చిత్రంగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ షూటింగ్ శనివారం ప్రారంభం కాగా... ఫహాద్ మేకర్స్‌తో దిగిన ఫోటో వైరల్ అవుతోంది.
The lens opens to a world FULL OF SURPRISES ❤️🔥❤️🔥#DontTroubleTheTrouble officially goes on floors today in Hyderabad 💥💥#FahadhFaasil @Shobu_ #PrasadDevineni @ssk1122 @ShashankYeleti @ArkaMediaWorks @SBbySSK pic.twitter.com/t9bqzjWY5i
— Arka Mediaworks (@arkamediaworks) October 18, 2025
ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో... ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ షోయింగ్ బిజినెస్ సంస్థలు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ కలిసి మూవీని నిర్మిస్తున్నారు. ఏడాది క్రితమే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కొన్ని కారణాలతో షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకు ముందు షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్ఎస్ కార్తికేయ 'ప్రేమలు' మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్‌గా మూవీనే నిర్మిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నవంబర్ 8 వరకూ కొనసాగుతుందని... ఇందులో కీలక సీన్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారు మేకర్స్. 2026 సెకండాఫ్‌లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుండగా... మంత్రదండం, పిల్లాడు, ఫహాద్ లుక్ వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ మూవీ ఓ ఫాంటసీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుండగా... కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.
Dont Trouble The Trouble Cast & Technical Team: హీరో : ఫహాద్ ఫాజిల్, డైరెక్టర్ : శశాంక్ యేలేటి, బ్యానర్లు : ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ, మ్యూజిక్ : కాలభైరవ. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.





















