Bandla Ganesh: టాలీవుడ్ పెద్దలకు బండ్ల గణేష్ దివాళీ పార్టీ - ఖర్చు ఎంతో తెలుసా?
Bandla Ganesh Diwali: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు హాజరయ్యారు.

Bandla Ganehs Diwali Celebrations Event: ఓ వైపు పొలిటికల్‌గా... మరోవైపు నటుడిగా... ఇంకోవైపు ఫేమస్ ప్రొడ్యూసర్‌గా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా మూవీ ఈవెంట్స్‌లో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. గణేష్ ప్రతీ ఏడాది దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈసారి కూడా తన ఇంట్లో పండుగ వేడుకలు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు.
ఇండస్ట్రీ పెద్దలు హాజరు
ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టాలీ ఇండస్ట్రీ పెద్దలు, యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అందరూ హాజరై ఘనంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్‌ను స్వయంగా ఆహ్వానించిన బండ్ల గణేష్ ఆయన్ను ప్రత్యేక సింహాసనంపై కూర్చోబెట్టారు. చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోస్ తేజ సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, అగ్ర దర్శకుడు, అగ్ర నిర్మాతలు హాజరయ్యారు.
అందరినీ పేరు పేరునా ప్రత్యేకంగా ఆహ్వానించిన గణేష్... వారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఇండస్ట్రీ పెద్దలంతా ఓ చోట చేరి పండుగ సెలబ్రేట్ చేసుకుంటూనే సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Megastar @KChiruTweets garu graced the grand Diwali celebrations hosted by blockbuster producer #BandlaGanesh in Hyderabad!🔥@ganeshbandla @actorsrikanth#Megastar #Diwali2025 pic.twitter.com/fFudHZFbBG
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 18, 2025
Blockbuster Ace Producer Bandla Ganesh hosts a grand #Diwali bash in Hyderabad.. ❤️#Tollywood pic.twitter.com/DeKRzdKodM
— Ramesh Bala (@rameshlaus) October 18, 2025
Megastar @KChiruTweets garu brought electrifying energy to the grand Diwali celebrations hosted by #BandlaGanesh in Hyderabad! 💥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 18, 2025
Spreading festive cheer as he wished everyone a Happy Diwali filled with light and joy. 🤩 ❤️ #Diwali2025 @ganeshbandla #ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/X6xDqVBWLt
'తేజ సజ్జా' మరో అల్లు అర్జున్
ఈ సందర్భంగా యంగ్ హీరో తేజ సజ్జాపై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తేజ ఫ్యూచర్‌లో మరో అల్లు అర్జున్ అవుతారని తెలిపారు. దీనికి తేజ సరదాగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఇటీవలే 'మిరాయ్'తో బిగ్ సక్సెస్ అందుకున్నారు.
బండ్ల గణేశ్ దీపావళి పార్టీలో స్టార్ బోయ్ సిద్ధూ జొన్నలగడ్డ #siddujonnalagadda #BandlaGanesh #Diwali2025 #diwalivibes pic.twitter.com/A0MM8cd7sF
— ABP Desam (@ABPDesam) October 18, 2025
Victory #Venkatesh at Bandla Ganesh Diwali Bash 2025 in Hyd pic.twitter.com/uLiyENyXQd
— Sai Satish (@PROSaiSatish) October 18, 2025
ఖర్చు ఎంతో తెలుసా?
బండ్ల గణేష్ పార్టీ అంటేనే మామూలుగా ఉండదు. అరేంజ్మెంట్స్ వేరే లెవల్‌లో ఉంటాయి. డెకరేషన్ దగ్గర నుంచి గెస్ట్‌లను రిసీవ్ చేసుకోవడం వరకూ ప్రతీది స్పెషల్. అదిరిపోయే సెట్స్‌తో గ్రాండ్‌గా దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేశారు గణేష్. ముఖ్యంగా విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. ఒక ప్లేట్ కాస్ట్ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక మొత్తం పార్టీ ఖర్చు రూ.1.5 కోట్ల వరకూ అయినట్లు సమాచారం.





















