Shambhala Release Date: క్రిస్మస్ బరిలో ఆది సాయికుమార్ 'శంబాల' - విశ్వక్ సేన్, రోషన్ మూవీస్‌తో పాటే... బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ సందడి?
Shambhala Movie: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'. ఈ క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Aadi Sai Kumar's Shamabhala Release Date Announced: ఈ క్రిస్మస్‌కు మూవీ లవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త మూవీస్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వక్ సేన్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'తో పాటు యంగ్ హీరో రోషన్ మేక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతుండగా... తాజాగా మరో సూపర్ నేచరల్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
క్రిస్మస్ బరిలో హ్యాట్రిక్ మూవీస్
ఎప్పుడూ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ భారీ హైప్ క్రియేట్ చేయగా 'శంబాల'లో ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'అతని క్రిస్మస్. ఇది కేవలం వెలుగు కాదు అది ఓ శక్తి. డిసెంబర్ 25న అగ్ని, ఉగ్రత, విధిని కలిపిస్తుంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తుండగా... షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... రవివర్మ, స్వాసిక, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతరిక్షం నుంచి అతీంద్రియ శక్తులున్న రాయి ఓ గ్రామంలో పడగా... అప్పటి నుంచి జరిగే పరిణామాలు, రాయి ప్రభావంతో గ్రామంలో ప్రజలు చనిపోవడం, సైన్స్‌కు అందని అంతుచిక్కని రహస్యాలను మూఢ నమ్మకాలకు ముడిపెడుతూ ఓ పవర్ ఫుల్ నేచరల్ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
View this post on Instagram
Also Read: ఇట్స్ అఫీషియల్... అదరగొట్టేశావ్ 'డ్యూడ్' - వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
క్రిస్మస్‌కు హ్యాట్రిక్ మూవీస్
ఈ క్రిస్మస్‌కు మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు హ్యాట్రిక్ మూవీస్ రెడీ అవుతున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' ఈ క్రిస్మస్‌కే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మూవీలో విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా... సీనియర్ హీరో నరేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' సైతం డిసెంబర్ 25నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా... స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి క్రిస్మస్ సందర్భంగా హ్యాట్రిక్ సందడి నెలకొననుంది.





















