Jugari Cross Title Promo: 'సు ఫ్రమ్ సో' ఫేం రాజ్ బి శెట్టి క్రేజీ ప్రాజెక్ట్ 'జుగారి క్రాస్' - టైటిల్ ప్రోమో చూశారా?
Raj B Shetty: 'సు ఫ్రమ్ సో' ఫేం రాజ్ బి శెట్టి మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫేమస్ కన్నడ నవల ఆధారంగా 'జుగారి క్రాస్' టైటిల్‌తో కొత్త మూవీ అనౌన్స్ చేశారు.

Kannada Actor Raj B Shetty New Movie Jugari Cross: రీసెంట్‌గా 'సు ఫ్రమ్ సో' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి. తాజాగా ఆయన తన కొత్త ప్రాజెక్టును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రముఖ రచయిత పూర్ణచంద్ర తేజస్వి ఫేమస్ నవల 'జుగారి క్రాస్' ఆధారంగా అదే టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 'కరావళి' ఫేం డైరెక్టర్ గురుదత్త గనిగ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమో వీడియో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
టైటిల్ ప్రోమో వేరే లెవల్
'ఎవరినైనా చంపుతున్నప్పుడు రక్షించేందుకు ఈ ప్రపంచంలో ఏదైనా మతం ఉందా?' అనే వాయిస్ ఓవర్‌తో టైటిల్ ప్రోమో ప్రారంభం కాగా... సస్పెన్స్, థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలు అన్నీ కలిపి ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నట్లు అర్థమవుతోంది. పుర్రెలు, మారణాయుధాలతో పాటు అద్భుతమైన విజువల్స్, బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలను హైలెట్ చేస్తున్నట్లు తెలుస్తుండగా... అవి ఉండే ప్రాంతం పేరేంటి? అంటూ అడగడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ! - ఆ డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ
రీసెంట్‌గా చిన్న సినిమాగా రిలీజైన 'సు ఫ్రమ్ సో' మూవీ సంచలన విజయం సాధించింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా అన్నీ భాషల్లో కలిపి రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. మూవీలో జేపీ తుమినాడ్, శనీల్ గౌతమ్, రాజ్ బి శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఇందులో 'కరుణాకర్ గురూజీ' పాత్రలో రాజ్ మెప్పించారు. ఇక త్వరలోనే 'కరావళి' మూవీలో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ కాక ముందే 'జుగారి క్రాస్' అంటూ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
'కరావళి' మూవీని కూడా గురుదత్త డైరెక్ట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ వైపు ఈ పనులు చూస్తూనే 'జుగారి క్రాస్' కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన యాక్టర్స్, ఇతర సిబ్బంది వివరాలు తెలియజేయనున్నారు.





















