Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. బీఆర్ఎస్ విజయం కోసం ప్లాన్ Bతో సిద్ధంగా ఉన్న కేసీఆర్
Jubilee Hills by Polls | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్లాన్ బీ ఉందని మీకు తెలుసా. మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు పి విష్ణువర్దన్ రెడ్డితో బీఆర్ఎస్ నామినేషన్ వేయించింది.

Jubilee Hills by Election: హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అసలే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు రాష్ట్ర రాజకీయాలకు షేక్ చేస్తుంది. అందుకే తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ నకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపాయి. పలుచోట్ల బంద్, నిరసన పాల్గొని బీసీలపై తమ ప్రేమను చాటుకునే ప్రయత్నం చేశారు. అయితే జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగానే ప్లాన్ చేసింది.
బీఆర్ఎస్ ప్లాన్ బీ ఎవరు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ బీ సిద్ధం చేసింది. ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి పి. జనార్ధన్ రెడ్డి (PJR) కుమారుడు పి. విష్ణువర్ధన్‌రెడ్డితో కూడా బీఆర్ఎస్ నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చింది. మాగంటి సునీత షేక్‌పేట ఎమ్మార్వోఆఫీసులో 3 సెట్ల నామినేషన్లు సైతం దాఖలు చేశారు. అయితే, ఏదైనా కారణంగా సునీత నామినేషన్ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ బీ ని తెరమీదకు తీసుకొచ్చింది. ఒకవేళ సునీత నామినేషన్ కనుక రిజెక్ట్ అయితే అని ముందు జాగ్రత్తగా పి. విష్ణువర్ధన్‌రెడ్డితోనూ బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేయించింది. ఈ ఉపఎన్నికల్లో సత్తా చాటి.. ఇది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు ప్రజల రిఫరెండం అని చూపించేందుకు గులాబీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రెహమత్ నగర్ డివిజన్
— Dasyam Vinaya Bhaskar (@dasyamofficial) October 18, 2025
18-10-2025 శనివారం, సాయంత్రం సమయం
భారత రాష్ట్ర సమితి పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి, దివంగత శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ సునీత గారితో పాటు ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా… pic.twitter.com/PHs90w1RrS
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థులు వీరే
బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు అవకాశం ఇచ్చింది. నవీన్ యాదవ్ గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసి భారీగా ఓట్లు సాధించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపింది. ఇక బీజేపీ విషయానికి వస్తే లంకల దిలీప్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చింది. 2023 ఎన్నికల్లోనూ ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
మరోవైపు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపైనర్లతో హస్తం పార్టీ లిస్ట్ విడుదల చేసింది. ప్రముఖ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా జాబితాలో ఉన్నారు.






















