Ajit Agarkar Comments on Team Selection | టీమ్ సెలక్షన్‌పై అగార్కర్ ఓపెన్ కామెంట్స్
టీమ్ ఇండియా సెలక్షన్ కమిటీపై ఎప్పుడు ఎదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్లేయర్స్ ను ఎందుకు టీమ్ లో సెలెక్ట్ చేయలేదు అంటూ ఫ్యాన్స్ వాదిస్తూనే ఉంటారు. అయితే ఒక సెలెక్టర్ గా ఉండే భాద్యతలు, ఒత్తిడి గురించి టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కామెంట్స్ చేసారు.
అగార్కర్ మాట్లాడుతూ “సెలెక్టర్‌గా మీరు 15 మంది స్క్వాడ్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత... మీ చేతిలో ఏమీ ఉండదు. మన దగ్గర ఉన్న క్రికెటర్స్ కి ట్యాలెంట్ ఎక్కువ. అందుకే టీమ్ ను సెలెక్ట్ చేయడం అత్యంత కఠినమైన, ఒత్తిడితో కూడిన బాధ్యత. మీరు తీసుకునే నిర్ణయాలు ప్లేయర్స్ కెరీర్‌లపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరినీ సాటిస్ఫై చేయడం అసాధ్యం. విమర్శలు కూడా వస్తాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు ఆసక్తి, ఆవేశం చాలా ఎక్కువ. #JusticeForShreyasIyer లాంటి ట్రెండ్స్ గురించి నేను పట్టించుకోను. ” అని అన్నాడు.
అజిత్ కామెంట్స్ కు ఫ్యాన్స్ రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. రీసెంట్ గా టీమ్ సెలక్షన్ పై షమీ చేసిన కామెంట్స్ వల్లే అజిత్ ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు ఫ్యాన్స్.





















