Judicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP Desam
వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చి బైరాగిపట్టెడ పద్మావతి పార్కులో తొక్కిసలాట జరగగా ఆ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఘటనకు కారణాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఈ రోజు తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. తిరుపతి కలెక్టరేట్‌లో కమిటీ కోసం ప్రత్యేక ఛాంబర్ ను ఆధికారులు ఏర్పాటు చేశారు. బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్..రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాల పరిశీలన చేసి టీటీడీ అధికారులు, పోలీసులనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో అక్కడ విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని ఎంక్వైరీ కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. 6 నెలల్లో విచారణ పూర్తి చేస ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కమిటీ ఇవ్వనున్న నివేదికపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.





















