అన్వేషించండి

8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రయోజనాలు ఏడాది ఆలస్యం, ఎందుకు?

8th Pay Commission Update: జీతాల పెంపు కోసం భారత ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు వెయిట్‌ చేయాల్సిందే!. ఎనిమిదో వేతన సంఘం తన పనిని పూర్తి చేయడానికి సంవత్సర కాలం తీసుకోవచ్చు.

8th Pay Commission Latest News Update: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగుల కోసం ఒక అప్‌డేట్‌ వచ్చింది. 8వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది జీతం ప్రస్తుత స్థాయి నుంచి భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనం కనీసం ఏడాది పాటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే, పెరిగిన జీతం ఒక సంవత్సరం పాటు చేతిలోకి రాకపోవచ్చు. ఎందుకంటే, ఎనిమిదో వేతన సంఘం ప్రాతిపదికన, జీతాల పెంపు కోసం, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) పార్లమెంటులో సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో (Union Budget For FY 2025-26) భారత ప్రభుత్వం ఎలాంటి డబ్బును కేటాయించలేదు.

వాస్తవానికి, ఎనిమిదో వేతన సంఘం కోసం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ మాత్రమే కోరుతున్నారు. ఈ విధంగా చూస్తే, ఎయిత్‌ పే కమిషన్ నివేదిక రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాతే జీతభత్యాల పెంపు నిర్ణయం వెలువడుతుంది. అంటే.. ఏ స్థాయి ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందో నిర్ణయించడానికి మరో సంవత్సర కాలం పట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగే జీతాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే, భారత ప్రభుత్వం తన తదుపరి బడ్జెట్‌లో అంటే 2026-27 బడ్జెట్‌లో ఆ పద్దు కోసం డబ్బును ఏర్పాటు చేయగలదు. 

టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ సూచించమని మంత్రిత్వ శాఖలకు లేఖలు
మనీకంట్రోల్ రిపోర్ట్‌ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ కూడా, భారత ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం ప్రకారం పెరిగిన జీతం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే పొందడం సాధ్యం అవుతుందని అంగీకరించారు. ప్రస్తుతం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సిబ్బంది & శిక్షణ మంత్రిత్వ శాఖలకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను సూచించాలని కోరుతూ లేఖ పంపింది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే 8వ వేతన సంఘం పనిలోకి దిగుతుంది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను భారత ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పే కమిషన్ తన పనిని ప్రారంభిస్తుందని వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ చెప్పారు.

మరో ఆసక్తికర కథనం: ఒకేసారి రూ.4,400 తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ     

గత కమిషన్‌కు ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం
మునుపటి కమిషన్, అంటే ఏడో వేతన సంఘం (7th Pay Commissio) తన నివేదికను సమర్పించడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం మార్చి 2025 నాటికి ఏర్పాటైనప్పటికీ, పని పూర్తి చేయడానికి కనీసం ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎయిత్‌ పే కమిషన్‌ రిపోర్ట్‌ 2026 మార్చి కంటే ముందు రాదని అర్ధమవుతుంది.

మరో ఆసక్తికర కథనం: రూపాయి చారిత్రాత్మక పతనం, డాలర్‌తో పోలిస్తే తొలిసారి రూ.87 కు క్షీణత 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Ayyappa swamy Temples : శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
Embed widget