Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Ind Vs Eng: భారీ టార్గెట్ ఛేదనలో ఇంగ్లాండ్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. 9.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయం పాలైంది. దీంతో పరుగుల పరంగా రెండో భారీ విజయాన్ని భారత్ నమోదు చేసింది.

Ind Vs Eng 5th T20 Live Updates: ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్ ను 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం ముంబైలో జరిగిన ఐదో టీ20లో ఇంగ్లాండ్‌పై 150 పరుగులతో విజయం సాధించింది. పరుగుల పరంగా భారత్‌కిది రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం. బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ సూపర్బ్ ఫిఫ్టీ (23 బంతుల్లో 55, 7 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అర్షదీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ 3 వికెట్లు తీసి రాణించాడు. గత మ్యాచ్‌లో గాయంతో కంకషన్ కు గురైన శివమ్ దూబే రెండు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో గత మ్యాచ్‌లో ఎదురైన విమర్శలకు దీటుగా టీమిండియా బదులిచ్చినట్లయ్యింది. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ లకు రెండేసి వికెట్లు దక్కాయి. రవి బిష్ణోయ్ ఒక వికెట్ దక్కింది.
𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🏆
— BCCI (@BCCI) February 2, 2025
Congratulations to the Suryakumar Yadav-led #TeamIndia on the T20I series win! 👏 👏#INDvENG | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/QvgUH8iClq
ఆరంభంలోనే దెబ్బ..
భారీ టార్గెట్ ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ టార్గెట్ ఛేజ్ చేస్తుందని అనిపించలేదు. షమీ వేసిన తొలి ఓవర్లో 16 పరుగులు సాధించడం ఒక్కటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్లస్ పాయింట్. ఆ తర్వాత ఓవర్లోనే ప్రమాదకర బెన్ డకెట్‌ను డకౌట్ చేసి ప్రత్యర్థికి షమీ షాకిచ్చాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుస వికెట్లను కోల్పోతూనే ఉంది. జట్టులో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు చేరిపోయారు. ఒక్క మంచి పార్ట్నర్ షిప్ కూడా నమోదు కాలేదు. రెండో వికెట్‌కు నమోదైన 25 పరుగులే జట్టులో అత్యధిక పార్ట్నర్ షిప్ కావడం విశేషం. ఓ ఎండ్‌లో సాల్ట్ నిలబడినా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. కెప్టెన్ జోస్ బట్లర్ (7), హారీ బ్రూక్ (2), లియామ్ లివింగ్ స్టన్ (9), జాకబ్ బెతెల్ (10) తదితరులంతా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు.
For ending the series with an impressive 14 wickets, Varun Chakravarthy is the Player of the Series 👏
— BCCI (@BCCI) February 2, 2025
Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/Pxs2liDEv1
21 బంతుల్లో ఫిఫ్టీ..
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ మాత్రమే ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలి ఓవర్లోనే ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన సాల్ట్.. ఆ తర్వాత తన దూకుడును కొనసాగించాడు. మిగతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ నేపథ్యంలో 21 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని తను వేసిన తొలి బంతికే ఔట్ చేసి దూబే షాకిచ్చాడు. దీంతో 82 పరుగుల వద్ద సాల్ట్ ఔటయ్యాడు. ఆ తర్వాత చివరి వరుస వికెట్లను తీయడంతో ఇంగ్లాండ్ ఘోరం పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌పై 150 పరుగులతో విజయం సాధించిన ఇండియా.. ఈ ఫార్మాట్లో పరుగుల పరంగా రెండో అతి పెద్ద విజయాన్ని సాధించింది. 2023 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో 168 పరుగులతో న్యూజిలాండ్ ఓడించడమే టీమిండియాకు పరుగులపరంగా అతిపెద్ద విజయం కావడం విశేషం.
అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 247/9తో భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ మైండ్ బ్లోయింగ్ సెంచరీ (54 బంతుల్లో 135, 7 ఫోర్లు, 13 సిక్సర్లు)తో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఎడపెడా బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఆరంభం నుంచి దూకుడు మంత్రం జపించి, ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. తను సాధించిన పరుగుల్లో బౌండరీల రూపంలోనే సెంచరీ రన్స్ (13 సిక్సర్లు, 7 ఫోర్లు) రావడం విశేషం. అతనికి తోడు శివమ్ దూబే (30) కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఒకదశలో 300 పరుగులు దాటుతుందా అనిపించినా,. కీలకదశలో ఇంగ్లాండ్ బౌలర్లు కోలుకుని, భారత స్కోరును 247కు పరిమితం చేశారు. అభిషేక్ కెరీర్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
ఇక అటు బ్యాటుతో సెంచరీ చేసి, ఇటు బాల్‌తో రెండు వికెట్లు తీసి, ఒక క్యాచ్ పట్టిన అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో 13 సిక్సర్లు కొట్టిన అభిషేక్.. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్‌గా ఉన్న రోహిత్ శర్మ రికార్డు (10 సిక్సర్లు)ను తుడిచేశాడు. ఇక సిరీస్ లో 14 వికెట్లు సాధించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఒక సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ గా తన పేరిటే ఉన్న రికార్డు (12 వికెట్లు, సౌతాఫ్రికాపై 2024)ను సవరించాడు. వరుణ్ కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఇక ఈనెల 6 నుంచి నాగపూర్ లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఇందులో వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా బరిలోకి దిగుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

