అన్వేషించండి

Radhika Apte: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే

Radhika Apte Baby Bump: నట సింహం నందమూరి బాలకృష్ణ 'లెజెండ్', 'లయన్' సినిమాల్లో నటించిన హిందీ హీరోయిన్ రాధికా ఆప్టే. ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్. ఇది హిందీ ఇండస్ట్రీకి కూడా షాకింగ్ న్యూస్.

రాధికా ఆప్టే (Radhika Apte) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్'తో పాటు 'లయన్' సినిమాలో ఆమె నటించింది. అంతకు ముందు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'రక్త చరిత్ర'లో కనిపించింది. ఇప్పుడు ఆమె నిండు గర్భవతి. ఈ విషయం తెలిసి మన తెలుగు ప్రేక్షకులే కాదు... హిందీ సినిమా ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఈ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని జనాలకు ఎప్పుడు తెలిసిందంటే?

బేబీ బంప్‌తో కనిపించిన రాధికా ఆప్టే
బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ (BFI London Film Festival 2024)కు రాధికా ఆప్టే అటెండ్ అయ్యింది. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన 'సిస్టర్ మిడ్ నైట్'. దాన్ని ఆ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఆ సినిమా స్క్రీనింగ్ కోసం బుధవారం రాధికా ఆప్టే వచ్చింది. ఆవిడను చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. బేబీ బంప్‌తో కనిపించిన రాధికా ఆప్టే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వాటిని ఆమె పోస్ట్ చేయడం విశేషం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Radhika (@radhikaofficial)

Radhika Apte Baby Bump Photos: 'సిస్టర్' స్క్రీనింగ్ ఫోటోలను రాధికా ఆప్టే షేర్ చేసే వరకు ఆవిడ ప్రెగ్నెంట్ అనే విషయం ప్రేక్షకులకే కాదు... హిందీ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు. దాంతో షాక్ అయ్యారు. అదీ సంగతి!

Also Read: మహానటి... అసలైన పరీక్ష ముందుంది మరి - ఇయర్ ఎండ్ కీర్తి సురేష్‌కు చాలా ఇంపార్టెంట్, ఎందుకో తెలుసా?


రాధికా ఆప్టేకు ఎప్పుడు పెళ్లి అయ్యింది?
ఆడియన్స్ కొంత మందిలో ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. రాధికా ఆప్టేకు ఎప్పుడు పెళ్లి అయ్యింది? ఆవిడ భర్త ఏం చేస్తారు? అని! ఎందుకు అంటే... రాధికా ఆప్టే పెళ్లి ఫోటోలు ఎప్పుడూ బయటకు రాలేదు. అసలు విషయం ఏమిటంటే... వివాహం అయిన తర్వాత కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పెళ్లైన తర్వాతే 'లెజెండ్', 'లయన్' వంటి సినిమాల్లో నటించారు.

రాధికా ఆప్టే భర్త పేరు బెనెడిక్ట్ టైలర్. ఆయన బ్రిటిష్ వ్యక్తి. మ్యూజిక్ కంపోజర్ అండ్ వయలనిస్ట్. రాధికా ఆప్టేతో బెనెడిక్ట్ వివాహం 2012లో జరిగింది. అయితే, అది లో ప్రొఫైల్ వెడ్డింగ్. ఆ మరుసటి ఏడాది 2013లో అఫీషియల్ వెడ్డింగ్ జరిగింది. రాధికా ఆప్టే నటించిన మూడు హిందీ సినిమాలు 'ఫోరెన్సిక్', 'విక్రమ్ వేద', 'మోనికా ఓ మై డార్లింగ్' 2013లో విడుదల అయ్యాయి. గత ఏడాది 'మిస్సెస్ అండర్ కవర్' సినిమా ఒక్కటే చేశారు. ఈ ఏడాది 'మేరీ క్రిస్మస్'లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు.

Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget