ఈ అందాల భామ పేరు రాధిక అని తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది ఫిక్స్ అయ్యారు. అసలు, ఈవిడ పేరు ఏంటంటే? 'డీజే టిల్లు'లో రాధికగా అలరించిన ఈ అమ్మాయి పేరు నేహా శెట్టి. రాధిక క్యారెక్టర్ ఎఫెక్ట్ వల్ల ఫేమస్ అయ్యారు. 'డీజే టిల్లు' కంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'మెహబూబా' సినిమా చేశారు నేహా శెట్టి. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న 'బెదురులంక 2012'లో నేహా శెట్టి నటించారు. 'బెదురులంక 2012'లో చిత్ర పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా నేహా శెట్టి కనిపించారు. రాధిక మోడ్రన్ అమ్మాయి అయితే... చిత్ర పల్లెటూరి పడుచు. రెండు పాత్రల మధ్య నేహా వేరియేషన్ చూపించారు. 'బెదరులంక 2012' విడుదలైన తర్వాత ప్రేక్షకులు నేహా శెట్టిని చిత్ర పేరుతో పిలుస్తున్నారని కార్తికేయ చెప్పారు. 'బెదురులంక 2012' సక్సెస్ మీట్ లో ఈ విధంగా శారీలో నేహా శెట్టి సందడి చేశారు. నేహా శెట్టి నటించిన 'రూల్స్ రంజన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదలకు రెడీ అవుతున్నాయి. నేహా శెట్టి