Akkada Ammayi Ikkada Abbayi: హీరోగా నాలుగేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్‌తో ప్రదీప్ కొత్త సినిమా... రీ ఎంట్రీ ప్లాన్ అదుర్స్
నాలుగేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఆ టైటిల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన గతంలో ఓ సినిమాతో హీరోగా మారి వెండితెరపై కూడా మెరిశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టైటిల్ తో బిగ్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు ఈ యాంకర్.
ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా టైటిల్ రివీల్
యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో ఈ సినిమా టైటిల్ తో పాటు కూడా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో ప్రదీప్ సరసన హీరోయిన్ గా జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి నటిస్తోంది. నితిన్, భరత్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతోంది. ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కనుంది అన్న విషయం ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే ఆయన రీ ఎంట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన టైటిల్ ని వాడుకోవడం విశేషం.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అన్న విషయం ఆయన అభిమానులకు బాగా తెలుసు. ఇప్పుడు ఇదే టైటిల్ తో ప్రదీప్ మాచిరాజు సినిమాను అనౌన్స్ చేయడం చర్చనీయాంశమైంది. మరి ఇన్నేళ్ల తరువాత రెండో సినిమాను అనౌన్స్ చేసిన ప్రదీప్ మాచిరాజుకి హెల్ప్ అవుతుందా? పవన్ కళ్యాణ్ టైటిల్ కలిసి వస్తుందా? "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో ప్రదీప్ మాచిరాజును అదృష్టం వరిస్తుందా? అనేది చూడాలి.
With lots of Hope & lots of Love ❤️
— Pradeep Machiraju (@impradeepmachi) October 17, 2024
This one is close to my heart 🥹
To entertain you all🤗….in theatres soon #AAIA #PradeepMachiraju2 is #AkkadaAmmayiIkkadaAbbayi / #అక్కడఅమ్మాయిఇక్కడఅబ్బాయి ❤️🔥
▶️ https://t.co/XcPzTI88R2
Pairing soon in theatres🫶#AAIA@impradeepmachi… pic.twitter.com/VQxNMHHlON
నాలుగేళ్ల తర్వాత రెండవ సినిమా...
యాంకర్ గా తనదైన స్టైల్లో పంచులు వేస్తూ, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు కాగా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సుదీర్ఘకాలం యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ వెండితెరపై సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమాతో ఎట్టకేలకు హీరోగా మారాడు. ఈ సినిమాలో పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కానీ సినిమాకి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ సినిమా రిజల్టు తరువాత దాదాపు నాలుగు ఏళ్ల వరకు ప్రదీప్ మరో సినిమా జోలికి వెళ్లలేదు. బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించకపోవడంతో ప్రదీప్ ఏమైపోయాడు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ నాలుగేళ్ల తర్వాత రెండో సినిమాకు సంబంధించిన ప్రకటనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రదీప్.
Read Also : Elon Musk : ఎలాన్ మస్క్ రోబోలను ఆ సినిమా నుంచి కాపీ కొట్టాడా? డైరెక్టర్ షాకింగ్ ఆరోపణలు