Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Keerthy Suresh Remuneration: మహానటి కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? సౌత్ సినిమాల్లో ఎంత? బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్ సినిమా చేసినందుకు ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్. మన తెలుగులో నటించిన మొదటి సినిమా 'నేను శైలజ' నుంచి రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కల్కి 2989 ఏడి'లో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇవ్వడం వరకు చాలా సినిమాలు చేశారు. తమిళంలోనూ ఆవిడ ఫేమస్ హీరోయిన్. ఆమె ఖాతాలో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. అయితే... ఇప్పుడు 'బేబీ జాన్' సినిమా (Baby John Movie)తో కీర్తి సురేష్ (Keerthy Suresh) బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఆ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
సౌత్ సినిమాలతో కంపేర్ చేస్తే డబుల్!
కీర్తి సురేష్ ఖాతాలో మహానటి వంటి విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించిన సినిమా ఉంది. అయితే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆవిడ రెమ్యూనరేషన్ ఎప్పుడు రెండు కోట్లు దాటలేదని టాక్. స్టార్ హీరోయిన్ అంటే తెలుగు, తమిళ భాషల్లో రెండు కోట్లు ఇవ్వడం చాలా ఎక్కువ. ఇక్కడితో పోలిస్తే హిందీ సినిమా ఇండస్ట్రీలో మొదటి అడుగుకు కీర్తి సురేష్ డబుల్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ నటించిన సినిమా 'బేబీ జాన్'. కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తీసిన 'తెరి' సినిమాకు అఫీషియల్ బాలీవుడ్ రీమేక్ ఇది. తమిళ సినిమాలో సమంత పోషించిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ చేశారు. ఈ సినిమాకు గాను ఆవిడ నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Varun Dhawan Remuneration For Baby John: కీర్తితో కంపేర్ చేస్తే వరుణ్ ధావన్ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ. ఈ సినిమాకు గాను ఆయన 25 కోట్ల రూపాయల పారితోషకం తన ఖాతాలో వేసుకున్నారని హిందీ చిత్ర పరిశ్రమ చెబుతోంది. ఇందులో జాకీ ష్రాఫ్ విలన్ రోల్ చేశారు ఆయన కోటిన్నర తీసుకున్నారట. ఇక తమిళ సినిమాలో అమీ జాక్సన్ టీచర్ రోల్ చేశారు ఆ సంగతి గుర్తు ఉండే ఉంటుంది హిందీలో ఆ క్యారెక్టర్ వామికా గబ్బి చేశారు. ఆమె కోటి రూపాయలు తీసుకున్నారట. బాలీవుడ్ బ్యూటీ సాన్యా మల్హోత్రా మరో రోల్ చేశారు. ఆవిడ 40 లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల
కేరళ నేపథ్యంలో 'బేబీ జాన్' సినిమాను రూపొందించారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. లుంగీ కట్టి మరీ వరుణ్ ధావన్ ఫైట్స్ చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ ఒక గెస్ట్ రోల్ చేశారు. అది సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందట. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. పర్సనల్ లైఫ్ చూస్తే... కీర్తి సురేష్ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఆంటోనీతో గోవాలో ఏడు అడుగులు వేశారు.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి