The Raja Saab Box Office Collection Day 6: భోగినాడు 'ది రాజా సాబ్' వసూళ్ళు ఎలా ఉన్నాయ్... ఇండియాలో ప్రభాస్ సినిమా నెట్ కలెక్షన్ ఎంత?
Prabhas Raja Saab Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' విడుదలైన ఆరు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది చూడండి.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన 'ది రాజా సాబ్' జనవరి 9న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ హారర్ కామెడీ సినిమా మొదటి రోజున భారీ వసూళ్లు సాధించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి కాస్త దారుణంగా ఉంది. సినిమా వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితి చూస్తుంటే... ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడేలా కనిపించడం లేదు. సినిమా ఆరో రోజు కలెక్షన్లు ఎంత అనేది బయటకు వచ్చింది.
'ది రాజా సాబ్'పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్యాన్స్‌ను పూర్తిస్థాయిలో శాటిస్‌ఫై చేయలేదు. కొన్ని సీన్స్ ఎడిట్ చేసి, యాడ్ చేసి రిలీజ్ చేశాక బావుందని టాక్ వచ్చింది. మరి ఆరో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
'ది రాజా సాబ్ 'ఆరో రోజు వసూళ్లు ఎంతంటే?
The Raja Saab 6th Day Collection: 'ది రాజా సాబ్' వసూళ్ల గురించి మాట్లాడితే... ఇండియాలో సినిమా రూ. 150 కోట్ల నెట్ కలెక్షన్ కలెక్ట్ చేయడం కూడా కష్టంగా ఉంది. వీకెండ్ అయ్యేలోపు కూడా ఈ సంఖ్యను దాటే అవకాశం కనిపించడం లేదు. కలెక్షన్స్ వివరాలు వెల్లడించే పోర్టల్ ప్రకారం... 'ది రాజా సాబ్' ఆరో రోజున కేవలం 5.25 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తం వసూళ్లు రూ. 124.65 కోట్లకు చేరుకున్నాయి.
సినిమా విడుదలకు ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్ షోల ద్వారా రూ. 9.15 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మొదటి రోజున రూ. 53.75 కోట్లు, రెండవ రోజున రూ. 26 కోట్లు, మూడవ రోజున రూ. 19.1 కోట్లు, నాల్గవ రోజున రూ. 6.6 కోట్లు, ఐదవ రోజున రూ. 4.8 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజుల్లో 'ది రాజా సాబ్' సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.119.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అందులో మెజారిటీ కలెక్షన్స్ తెలుగు నుంచి వచ్చాయి. ఆల్మోస్ట్ వంద కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ నుంచి రూ. 18.65 కోట్లు, తమిళ్ నుంచి కోటి, కన్నడ నుంచి 29 లక్షలు, మలయాళం నుంచి 21 లక్షలు వచ్చాయి.
'ది రాజ్ సాబ్' సినిమాకు ఆరో రోజున... భోగి నాడు ఫెస్టివల్ సీజన్, హాలిడేను క్యాష్ చేసుకుంది. ఈ సినిమాకు బుధవారం ఇండియాలో రూ. 10 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
ప్రభాస్ పాత సినిమాల రికార్డులను కూడా 'ది రాజా సాబ్' బ్రేక్ చేయలేకపోయింది. ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు.





















