Gautam Bigg Boss Telugu: మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
Gautam Krishna Bigg Boss 8: 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ తప్పకుండా గౌతమ్ కృష్ణ అని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, నిఖిల్ విజేతగా నిలిచాడు. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత గౌతమ్ ఏం చెప్పాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు సోలో బాయ్ గౌతమ్ కృష్ణ (Gautam Krishna). ట్రోఫీ పోతే పోయింది. అతను మాత్రం మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు. అవును... మీరు చదివింది నిజం. మెగాస్టార్ చిరంజీవి భార్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తల్లి సురేఖ అభిమానం సంపాదించాడు గౌతమ్.
గౌతమ్... అమ్మ నీకు పెద్ద ఫ్యాన్ అన్నారు రామ్ చరణ్!
'బిగ్ బాస్ 8' గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత గౌతమ్ కృష్ణ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ కార్యక్రమంలో రన్నరప్ అని తెలిశాక తాను కొంచెం లో ఫీలైనట్టు చెప్పారు. ఆ టైంలో రామ్ చరణ్ సపోర్ట్ ఇచ్చారట.
''నాతో రామ్ చరణ్ అన్న ఒక్క మాట అన్నారు. ఎప్పుడు అయితే నేను రన్నరప్ అని తెలిసిందో... అప్పుడు నేను కొంచెం 'లో' ఫీల్ అవుతున్నాను. అప్పుడు అన్న నా దగ్గరకు వచ్చారు. 'గౌతమ్... మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్. ప్రతి రోజూ తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది. నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా సరే... ఈ రోజు ఇది జరిగిందని చెబుతుంది. అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపించింది. బిగ్ బాస్ ఫినాలేకు వెళ్తున్నాని అమ్మకు చెబితే గౌతమ్ తప్పకుండా విన్ అవుతాడని చెప్పారు. నువ్వు ఏం దిగులు పడకు. జీవితంలో పైకి వెళ్తావ్' అని చెప్పారు. అన్న మాటలు నాకు ఎంతో బూస్ట్ ఇచ్చాయి'' అని గౌతమ్ కృష్ణ చెప్పారు.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
View this post on Instagram
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 (Bigg Boss 8 Telugu) గ్రాండ్ ఫినాలే చూస్తే గనుక... నిఖిల్ మలియక్కల్ విన్నర్ అని తెలిశాక గౌతమ్ కృష్ణ కొంచెం డిజప్పాయింట్ అయ్యాడు. ఆ టైంలో రామ్ చరణ్ అతని పక్కన ఉన్నారు. భుజం తడుతూ ధైర్యం చెప్పారు. విన్నర్ అనౌన్స్ చేసిన వెంటనే రామ్ చరణ్ కొంచెం కాస్త నిరాశ చెందినట్టు కనబడుతుంది.
మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా జనసేనాని - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు గౌతమ్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్. ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో పవన్ మీద తన అభిమానం చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి మెగా అభిమానం చూపించాడు గౌతమ్ కృష్ణ. అతను హీరోగా నటించిన 'సోలో బాయ్' సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.