Bigg Boss 8 Telugu Finale Highlights: నిఖిలే విన్నర్... ట్రోఫీ ఇచ్చిన రామ్ చరణ్, స్టార్స్ సందడి - బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి
Bigg Boss 8 Telugu Grand Finale LIVE Updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. రామ్ చరణ్ అతిథిగా వచ్చిన ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి.

Background
తెలుగు బుల్లితెర మీద అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మధ్యలో ఓటీటీ కోసం షో చేశారు. మూడు నెలల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ (bigg Boss Telugu season 8 grand finale)కు ఈ రోజుతో ఎండ్ కార్డు పడుతుంది. బిగ్ బాస్ ఫినాలే ఆదివారం (డిసెంబర్ 15న) కన్నుల పండగగా జరిగింది. ఆ ఫినాలేలో ఏం జరిగిందో ఈ లైవ్ అప్డేట్స్ పేజ్ చూసి తెలుసుకోండి.
ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. షో హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున తో కలిసి స్టేజి మీద సందడి చేశారు. ఆయనతో పాటు మరో మెగా హీరో, సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ కూడా ఫినాలేకు అతిథిగా వచ్చారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాలేదు కానీ... వాళ్లిద్దరి సినిమా టీమ్స్ వచ్చాయి. 'డాకు మహారాజ్'తో పాటు 'పుష్ప 2' టీమ్ కూడా సందడి చేసింది. ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. ఈ చిత్ర బృందాలతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర, తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి సైతం సందడి చేశారు. 'విడుదల 2', 'యుఐ' మూవీ ప్రమోషన్స్ చేశారట.
బిగ్ బాస్ 8 ఫినాలేకి చేరుకున్న టాప్ 5 ఎవరు?
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలైంది. షో స్టార్ట్ అయ్యి 105 రోజులు అయ్యింది. మొదట బిగ్ బాస్ ఇంట్లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత 35వ రోజున మరో ఎనిమిది మంది ఇంట్లో అడుగు పెట్టారు. టోటల్ 22 మంది కంటెస్టెంట్లు కాగా... అందులో 17 మంది ఆల్రెడీ బయటకు వచ్చేశారు. ఇక ఇంటిలో ఉన్నది ఐదుగురు.
Also Read: బిగ్ బాస్ 8 ట్రోఫీకి మూడు అడుగుల దూరంలో నబీల్... విన్నర్ ముగింట నిలిచిన జర్నీలో ప్లస్, మైనస్
హీరో కమ్ డాక్టర్ గౌతమ్ కృష్ణతో పాటు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఫేమ్ ప్రేరణ కంభం, మరో సీరియల్ నటుడు నిఖిల్, ఎటువంటి నేపథ్యం లేకుండా ఇంటిలో అడుగుపెట్టిన వరంగల్ కుర్రాడు - యూట్యూబర్ నబీల్ అఫ్రిది, టీవీ షోలు చూసే తెలుగు ప్రజలకు బాగా తెలిసిన అవినాష్ చివరి వరకు మిగిలారు. ఇందులో నిఖిల్ మలయక్కల్ విన్నర్ అయ్యాడని టాక్. ఆ విషయం ఫినాలేలో అనౌన్స్ చేయనున్నారు.
ఫినాలేలో నిఖిల్ విన్నర్ అని చెప్పే ముందు ఏం జరుగుతుంది? షో ఎలా రన్ చేస్తారు? ఎవరెవరు ఏయే పాటలకు డ్యాన్స్ చేస్తారు? అనేది చూడాలి. ఆ అప్డేట్స్ కోసం లైవ్ పేజీ ఫాలో అవ్వండి.
Also Read: టాప్ 5లో బ్యూటిఫుల్ లేడీ... 4తో సరి - ప్రేరణ ఆటలో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
అమ్మకు అంకితం... మీవాడు అని ప్రూవ్ చేశారు - రామ్ చరణ్
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్... ఆ విజయాన్ని తల్లికి అంకితం ఇచ్చారు. ''నేను మీ (తెలుగు) ఇంటి వాడు అని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ ఇంటిలో నేను ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నాను. అందరికీ థాంక్స్'' అని నిఖిల్ చెప్పారు.
'బిగ్ బాస్ 8' తెలుగు విజేతగా నిఖిల్
గౌతమ్ కృష్ణ, నిఖిల్... ఇద్దరిలో విజేతగా నిలిచినది నిఖిల్ అని నాగార్జున అనౌన్స్ చేశారు. రన్నరప్ స్థానంతో గౌతమ్ కృష్ణ సరిపెట్టుకున్నారు.





















