టీమిండియా పరువు కాపాడిన బౌలర్లు
246 పరుగులు ..ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకోవాలంటే టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో చేయాల్సిన స్కోరు ఇది. కానీ కంగారూ బౌలర్ల దెబ్బకు మన బ్యాటింగ్ విభాగం గడగడలాడింది. వర్షం ఓవైపు, ఆస్ట్రేలియా బౌలర్లు మరో వైపు బ్రిస్బేన్ లో జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్ బ్యాటర్లను ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు. కానీ కేఎల్ రాహుల్ 84పరుగులు, రవీంద్ర జడేజా చేసిన 77పరుగుల అసామాన పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకోగలదేనే ఆశలను పుట్టించింది ఫ్యాన్స్ లో. బట్ మధ్య మధ్యలో వర్షం పడుతూనే మ్యాచ్ ను డిలే చేస్తుండటంతో...ఆస్ట్రేలియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. 213 పరుగుల వద్ద ఉన్న ఆఖరి బ్యాటింగ్ హోప్ రవీంద్ర జడేజా కూడా అవుటయ్యాడు. ఈ దశలో టీమిండియా ఫాలో ఆన్ ఆడక తప్పదని ఫిక్స్ అయిపోయిన వచ్చారు ఇద్దరు బౌలర్ల లాంటి బ్యాటర్లు. ఆకాశ్ దీప్, జస్ ప్రీత్ బుమ్రా ఇద్దరూ కలిసి అస్సలు మాత్రం భయం లేకుండా ఆడారు. ఆకాశ్ దీప్ 31 బాల్స్ లో రెండు ఫోర్లు ఓ సిక్సర్ తో 27పరుగులు, బుమ్రా 27 బంతుల్లో ఓ సిక్సర్ తో 10 పరుగులు చేయటంతో ఊహించని రీతిలో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. దీంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఈ టెస్ట్ లో మొదటిసారి చిరునవ్వులు కనిపించాయి. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, విరాట్ కొహ్లీ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ మూమెంట్ ని. ఇప్పుడు వీళ్లిద్దరి ముందు లక్ష్యం ఒకటే వీలైనంత ఆస్ట్రేలియా లీడ్ ను కరిగించటం...అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రా అవటం ఖాయం. కానీ ఈ మ్యాచ్ డ్రా అయినా కూడా మనోళ్లు అద్భుతంగా పోరాడినట్లే.