అన్వేషించండి

Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం

Latest Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. దీనికి తోడు ఏపీని వర్ష భయం వెంటాడుతోంది.

Weather Today: తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఇంట్లో ఉన్నా సరే ముసుగు తీయాలంటే జడుసుకుంటున్నారు. దీనికి తోడు జలుబు జ్వారాలు జనాలను మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం పది గంటలకి కూడా కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. వృద్ధులు, చిన్న పిల్లలు, గుండె జబ్బులు ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. పొలం పనులకు వెళ్లే వాళ్లు పొగమంచు, చలికి రోగాల బారిన పడుతున్నారు.

తెలంగాణలో వాతావరణం(Telangana Weather Today)
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చలి తీవ్రతకు జనాలు రూమ్‌ హీటర్లు, చలి మంటలు పెట్టుకంటున్నారు. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే సిబ్బంది, బడులకు వెళ్లే విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 5.8 డిగ్రీల మంగళవారం ఉష్ణోగ్రత నమోదైంది.

సాధారణ ఉష్ణోగ్రత 1.6 నుంచి ౩ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు:- భద్రాచలం, దుండిగల్, హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్. 
సాధారణ ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు:- హకీంపేట, హనుమకొండ
సాధారణ ఉష్ణోగ్రత 5 డిగ్రీల కంటే ఎక్కువగా పడిపోయిన ప్రాంతాలు:- ఆదిలాబాద్‌, మెదక్, పటాన్‌చెరు 

హైదరాబాద్‌లో వాతావరణం (Hyderabad Weather today)
హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 13 డిగ్రీ ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈశాన్య దిశలో గంటకు 2 నుంచి  6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత  29.6 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలు నమోదు అయింది.  

హైదరాబాద్‌లో రోజంతా చలి చంపేస్తోంది. జనం బయటకు వచ్చి ఆఫీసులకు వెళ్లి రావాలంటే వణికిపోతున్నారు. సాయంత్ర ఐదు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు.  పొగమంచు వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది.  

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెబుతోంది.  

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Andhra Pradesh Weather Today)
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ఉంది. ఓవైపు వర్షాలు భయపెడుతుంటే... మరోవైపు ఎముకలు కొరికే చలి తెగ ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఈ వాతావరణం రైతులను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. అసలే చేతికి పంట వస్తున్న టైంలో ఓ వైపు వర్షం మరోవైపు పొగ మంచు నష్టాన్ని మిగులుస్తుందని భయపడుతున్నారు.  

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  దీని కారణంగా విజయనగరం,విశాఖ,అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం,  అల్లూరిసీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు  వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget