అన్వేషించండి

Elon Musk : ఎలాన్ మస్క్ రోబోలను ఆ సినిమా నుంచి కాపీ కొట్టాడా? డైరెక్టర్ షాకింగ్ ఆరోపణలు 

Elon Musk : ఎలాన్ మస్క్ రీసెంట్ గా రిలీజ్ చేసిన రోబోలు, సైబర్ వ్యాన్ వంటి వాటిని ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ ఆ సినిమా డైరెక్టర్ కామెంట్స్ చేశారు.

Elon Musk Robot Designs : సినిమాలకు సంబంధించి కాపీ కాంట్రవర్సీలు రావడం కొత్తేమీ కాదు. కానీ సినిమాలో చూసి రియల్ లైఫ్ లో కాపీ కొట్టారు అనే వివాదాలు మాత్రం కాస్త కొత్తగానే ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటి ఆరోపణలు ఏకంగా ఎలాన్ మస్క్ ఎదుర్కోవడం విశేషం. గతవారం ఎలాన్ మస్క్ టెస్లా ఈవెంట్ లో ఆప్టిమస్ రోబోట్లను ఆవిష్కరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈవెంట్లో ఆయన డ్రైవర్ లెస్ రోబో వ్యాన్లతో పాటు సైబర్ క్యాబ్ కూడా ఆవిష్కరించారు. అవి ఫ్యూచరిస్టిక్ గా, చూడడానికి సై-ఫై సినిమాలా అద్భుతంగా ఉండడంతో ఈ వార్త ప్రపంచమంతా ఒక్కసారిగా వైరల్ అయింది.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ వీడియోలు, ఫోటోలే చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఆయన లాంచ్ చేసిన ఈ రోబోలు చూస్తుంటే ఏదో ఫ్యూచర్స్టిక్ ఫ్యాంటసీ సినిమా కళ్ళముందే కదలాడుతుందా? అన్నట్టుగా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈవెంట్ లోని సినిమాలు, వీడియోలపై గతంలో 'ఐ రోబోట్' అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ అలెక్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఎలాన్ మస్క్ ఆ హాలీవుడ్ సినిమా రోబోలను కాపీ కొట్టారా? 

"ఐ రోబోట్" అనే సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ లీడ్ రోల్ పోషించారు. ఇందులో హ్యూమనాయిడ్ రోబోట్ లకు వ్యతిరేకంగా పోరాడే డిటెక్టివ్ ఆయన. 2004లో రిలీజ్ అయిన ఈ 'ఐ రోబోట్' సినిమా అప్పట్లో మూవీ లవర్స్ ని విశేషంగా అలరించింది. ఈ అద్భుతమైన విజువల్ ట్రీట్ కి ప్రేక్షకులు ఫిదా కావడంతో సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు తన సినిమాలోని రోబోల మాదిరిగానే ఎలాన్ మస్క్ రిలీజ్ చేసిన కొత్త రోబోలు అచ్చుగుద్దినట్టుగా ఉన్నాయని, ఎలాన్ మస్క్ తన డిజైన్లు కాపీ చేసారంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. కానీ ఆయన కామెంట్స్ పై మస్క్ ఇంకా స్పందించలేదు. 

రీల్ కు రియాలిటీకి పోలిక...

డైరెక్టర్ అలెక్స్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు అది నిజమేనని పోలికలు పెడుతూ పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఎలాన్ మస్క్ రిలీజ్ చేసిన రోబోలు మాత్రమే కాదు ఆయన లాంచ్ చేసిన సైబర్ క్యాబ్, రోబో వ్యాన్ కూడా అచ్చం 'ఐ రోబోట్' సినిమాలోని వాహనాలను పోలి ఉండడం గమనార్హం. అంతేకాకుండా మస్క్ ఈవెంట్ కి 'వియ్ రోబోట్' అని పేరు పెట్టారు. దీంతో మొత్తానికి రియాలిటీకి రీల్కి మధ్య పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన విజువల్స్ ని, ఎలాన్ మస్క్ ఈవెంట్ కు సంబంధించిన విజువల్స్ ని పోల్చి చూపుతూ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా మస్క్ కాపీ కొట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ రీల్, రియాలిటీ నిజం కావడం అనేది కొందరిని అబ్బుర పరిస్తే, మరికొందరు మాత్రం కాపీ కొట్టడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Read Also ; Ram Charan: గ్లోబల్ స్టార్ గోల్డెన్ హార్ట్, చిన్నారి గుండెకు ప్రాణం పోసిన రామ్ చరణ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget