అన్వేషించండి

Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ

South Railway | పలానా టికెట్ తీసుకుని పలానా కోచ్, రైళ్లలో జర్నీ చేయవచ్చు అని, అందుకు జరిమానా కడితే సరిపోతుందని ఎవరైనా వీడియోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు రైళ్లకు సంబంధించి నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ చేస్తున్నారు. దాంతో రైల్వే కార్యకలాపాలు, రూల్స్ గురించి తప్పుడు వీడియోలు, ఫేక్ న్యూస్, షార్ట్ రీల్స్‌ను ప్రచారం చేస్తున్న వ్లాగర్‌లపై దక్షిణ రైల్వే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారిక సమాచారాన్ని అందిస్తున్నట్లుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, తద్వారా ప్రయాణికులు రైల్వే నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రోత్సహిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే వదిలేస్తే పరిస్థితి చేయి దాటుతుండడంతో చెన్నై డివిజన్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వ్లాగర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.

తప్పుడు ప్రచారంతో రైల్వే సిబ్బందికి ఇబ్బందులు
రిజర్వేషన్ లేని సాధారణ టికెట్‌తో ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించవచ్చు అని, రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తే కేవలం టికెట్ ధరతో పాటు అదనంగా ₹250 జరిమానా చెల్లిస్తే సరిపోతుందని వైరల్ అవుతున్న కంటెట్ లో వాస్తవం లేదని రైల్వేశాఖ తెలిపింది. అలాగే ప్లాట్‌ఫాం టికెట్ తప్పనిసరి కాదంటూ కొందరు అవాస్తవాలను వీడియోలు, రీల్స్, షార్ట్స్ ద్వారా ప్రచారం చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇది నిజమని నమ్మి ప్రయాణికులు తరచుగా రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవడంతో వీటిపై చర్యలకు సిద్ధమైన రైల్వే అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను ప్రారంభించారు.

తప్పుడు కంటెంట్‌ను తయారుచేసి, ప్రచారం చేస్తున్న వారిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వ్లాగర్లు ఉన్నారని రైల్వేశాఖ గుర్తించింది. అటువంటి వ్యక్తుల జాబితాను రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, రైల్వేశాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫ్యాక్ట్-చెక్ హ్యాండిల్‌ను కూడా ప్రారంభించింది. రైల్వే గురించి ఏదైనా తప్పుదారి పట్టించే సమాచారం ఉంటే, నెటిజన్లు ఈ హ్యాండిల్‌కు ట్యాగ్ చేయడం ద్వారా వారిని కంట్రోల్ చేయవచ్చు అని సలహా ఇచ్చింది. 

రైల్వేస్టేషన్లలో వీడియోలపై ఆంక్షలు
రైల్వే నిబంధనల ప్రకారం, రైల్వే ప్రాంగణంలో ముందస్తు అనుమతి లేకుండా  వీడియోలు, వ్లాగ్‌లు లేదా ఫోటోలు తీయడం శిక్షార్హమైన నేరం. రీల్స్ కోసం ట్రాక్‌లపైకి వచ్చి ఉల్లంఘనలకు పాల్పడే వారిని సైతం అరికట్టాలని రైల్వే  అధికారులు భావిస్తున్నారు. స్టేషన్లు, యార్డులు, డిపోలు, దుకాణాల లోపల వీడియోలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన పర్మిషన్ రూల్స్ మరింత కఠినతరం చేయనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Highway Helpline: పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
Advertisement

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Highway Helpline: పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Sai Pallavi: రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Embed widget