Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 92 రివ్యూ... అన్యాయం అంటూ సంజన ఆవేదన... ఇమ్యూనిటీ పోరులో ఇమ్మూ ముందంజ... వెనకబడిపోయిన తనూజ
Bigg Boss 9 Telugu Today Episode - Day 92 Review : ఫినాలేకు మరికొన్ని రోజులే ఉండడంతో టాప్ 7 కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ ఆదేశం మేరకు ప్రస్తుతం అందరూ నామినేషన్లలోనే ఉన్నారు.

బిగ్‌బాస్ డే 92 రోజు ఉదయాన్నే "యుద్ధం ఇప్పుడ తుది దశకు చేరుకుంది. విజయం మీ కళ్ళముందే కన్పిస్తూ ఒక్క అడుగు దూరంలో ఉంది. మీలో ఒక్కరు మాత్రమే ఆ మధురానుభూతిని పొందుతారు. ఇప్పటికే మీలో కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అతన్ని తప్ప మిగతా వాళ్ళు అందరినీ డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నాను. భరణి ఇక్కడున్న వాళ్ళలో మీరు ఒక్కరే కెప్టెన్ కాలేదు. అందుకే మిమ్మల్ని ఈ హౌస్ కెప్టెన్ గా నియమిస్తున్నాను. కానీ మీకు ఇమ్యూనిటీ లభించదు గుర్తుంచుకోండి" అంటూ గుడ్ న్యూస్ చెప్పారు బిగ్ బాస్.
సంజనకు తీరని అన్యాయం
"మీలో ప్రతి ఒక్కరూ ఈ సీజన్ 9 ప్రయాణంలో మీ ముద్ర వేశారు. ఈ యుద్ధాన్ని ఉత్సాహభరితంగా మార్చడంలో మీ కృషి ఉంది. ఇప్పుడు ఆ కృషిని లెక్కించే సమయం వచ్చింది. ఆ బాక్స్ లలో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది నిర్ణయిస్తాయి. అందుకే దాన్ని నిర్ణయించే బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు నిర్ణయించే పాయింట్స్ తుది దశపై, విన్నర్ ప్రైజ్ మనీపై ఎఫెక్ట్ చూపిస్తాయి. బాల్ ను తీసుకుని మీరు ఆ పాయింట్స్ ఎవరిని ఇవ్వాలో చెప్పాలి. ఒకవేళ ఇద్దరి కంటే ఎక్కువమంది ఏకీభవిస్తే పాయింట్స్ తీసుకోవచ్చు. లేదా బాక్స్ ను అక్కడే పెట్టాలి. కళ్యాణ్ సంచాలక్. అతను బాక్స్ ను వేరొకరికి ఇవ్వొచ్చు. కానీ, అతనికి ఎవ్వరూ ఇవ్వొద్దు" అని చెప్పారు బిగ్ బాస్.
ఫస్ట్ బాల్ ను డెమోన్ పట్టుకుని సుమన్ కు లక్ష ఇద్దాం అనుకుంటున్నట్టు చెప్పాడు. నెక్స్ట్ బాల్ ను భరణి తీసుకుని తనూజాకు 2 లక్షలు ఇచ్చాడు. కానీ "నేను 2.5కి డిజర్వ్ అనుకుంటున్నా" అంటూనే ఆ పాయింట్స్ తీసుకుంది. తరువాత బాల్ తీసుకుని ఇమ్మూకి 2.5 లక్షల పాయింట్స్ ఇచ్చాడు కళ్యాణ్. "చూశావా రీతూ నువ్వుండి ఉంటే నాకు సపోర్ట్ చేసేదానివి. కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు" అని కెమెరాకు చెప్పి బాధ పడ్డాడు కళ్యాణ్. ఇమ్మూ "ఆమె మెంటల్ గేమ్ సూపర్" అంటూ సంజనాకు 1.50 లక్షల పాయింట్స్ ఇస్తే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. సుమన్ డెమోన్ కి 1.50 లక్షలు ఇచ్చాడు. ఇచ్చాక "వాళ్ళు డెమోన్ కు సపోర్ట్ చేయమన్నారు" అంటూ భరణికి తనూజాతో పాటు మిగిలిన వాళ్లపై సుమన్ కంప్లైన్ చేశాడు. సంజన చివరికి బాల్ తీసుకుని "50,000 నాకోసం ఉంచుకుంటా. జీరో భరణికి ఇస్తా" అని చెప్పింది. కానీ ఆమె నిర్ణయాన్ని హౌస్ మేట్స్ తారుమారు చేశారు. 50,000 భరణికి, జీరో సంజనాకు ఇచ్చారు. "మీరు ఈ సీజన్లో చేసిన ప్రదర్శనకు జీరోకి అర్హులు అని హౌస్ మేట్స్ అనుకుంటున్నారు. కాబట్టి మీరు నా తదుపరి ఆదేశం వరకు జైల్లో ఉండాలి" అంటూ సంజనను జైల్లో పెట్టారు.
మొదటి స్థానంలో ఇమ్మాన్యుయేల్
"లాస్ట్ వీక్ సుమన్ అన్నకు ఎంత మోటివేషన్ చేశాను, తనూజా కోసం ఎంత సపోర్ట్ చేశాను. జనాలు దారుణం ఉన్నారు. తల్లిలా ఆలోచించి ఎమోషనల్ ఫూల్ అవుతున్నా. ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు" అంటూ ఎమోషనల్ అయ్యింది సంజన. "ఫైనలిస్ట్ గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మీకిస్తున్న టాస్క్ లు ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనేలా చేస్తాయి. లీడర్ బోర్డులో టాప్ 1గా నిలిచిన వారు సేవ్ అయ్యి ఇమ్యూనిటీ పొందుతారు. టాప్ 2లో ఇద్దరు ప్రేక్షకులను ఎదుర్కొని, నామినేషన్ నుంచి బయట పడే ఓటు అప్పీల్ చేసుకోవచ్చు. ఏ సమయంలోనైనా అట్టడుగున ఉన్న సభ్యులు ఈ పోరాటం నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చు. సంజన మీరు మొదటి ఛాలెంజ్ లో పాల్గొనడానికి వీల్లేదు" అంటూ 'స్వింగ్ జరా' అనే ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇమ్మూ 50, భరణి 40, డెమోన్ 30, తనూజా 20, సుమన్ 10 పాయింట్స్ తెచ్చుకున్నారు.





















