Bigg Boss Telugu 9 Time Change : బిగ్‌బాస్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్, టైమ్ మారిపోతుంది.. తమిళ హిట్ సీరియల్ 'పొదరిల్లు' కోసమే
Podharillu Serial Star Maa : సోమవారం నుంచి బిగ్‌బాస్ ప్రసారం రాత్రి పది గంటలకు ఉండబోతుంది. ఈ టైమ్ స్లాట్‌లో పొదరిల్లు అనే కొత్త సీరియల్‌ని మొదలుకానుంది. పూర్తి డిటైల్స్ చూసేద్దాం.

Bigg Boss Telugu 9 Time Change Podharillu Serial : బిగ్‌బాస్ ప్రేక్షకులకు స్టార్ మా ఓ బ్యాడ్ న్యూస్ ఇచ్చింది. త్వరలోనే ముగియనున్న బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు టైమింగ్స్ మార్చేసింది. ఇప్పటివరకు డే ఎపిసోడ్ రాత్రి 9.30కు వచ్చేది. కానీ ఈ సోమవారం అంటే డిసెంబర్ 8వ తేదీనుంచి రాత్రి పది గంటలకు బిగ్‌బాస్ ఎపిసోడ్ రానుంది. దీనికి కారణం ఓ కొత్త సీరియల్ ప్రారంభమే. అదే పొదరిల్లు.
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు మరో రెండు వారాలు మాత్రమే ఉంది. అందుకే ఆ టైమ్‌లో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం కోసం స్టార్ మా కొత్త సీరియల్‌ను తీసుకువస్తోంది. అదే పొదరిల్లు. ఈ సీరియల్ డిసెంబర్ 8వ తేదీనుంచి ప్రసారం కానుంది. అనుకోని కారణాల వల్ల పెళ్లి చేసుకుని, ఆడదిక్కు లేని ఇంట్లోకి అడుగు పెట్టిన మహాలక్ష్మి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? ఆ ఇంటిని పొదరిల్లుగా ఎలా మార్చిందనేది సీరియల్.
తమిళ సీరియల్
పొదరిల్లు సీరియల్‌ను తమిళ్లో హిట్ అయిన Ayynnar thunai సీరియల్ రిమేక్ అని చెప్తున్నారు. ఇప్పటికే ఈ పొదరిల్లుకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తుంది స్టార్ మా. దాని ప్రకారం.. ఇంట్లో అన్నదమ్ములు తండ్రి మాత్రమే ఉంటారు. ఎవరికి నచ్చినట్లు వారు ఉండే ఓ బ్యాచిలర్ లాంటి ఇంట్లోకి పెళ్లి చేసుకుని హీరోయిన్ వస్తుంది. మావగారికి ఉదయాన్నే కాఫీ ఇవ్వాలనుకుంటే.. 90 మందు వేసి రోజును ప్రారంభిస్తాడు. ఇలాంటి ఎన్నో ఫన్నీ మూమెంట్స్‌తో.. మరిన్ని ఎమోషన్స్ కలగలిపి ఈ సీరియల్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.






















