అన్వేషించండి
OTT Family Drama: రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా సినిమా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Regina Cassandra OTT Movies: హీరోయిన్ రెజీనా కసాండ్రా నటించిన సినిమా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? రెస్పాన్స్ ఎలా ఉంది? అనేది తెలుసా?

రెజీనా కసాండ్రా
1/5

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన సినిమా 'ఉత్సవం'. ఇందులో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, నాజర్, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా ప్రధాన తారాగణం. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.
2/5

రెజీనా తెలుగులో పలు సినిమాలు చేశారు. అయితే, కొంత విరామం తర్వాత 'ఉత్సవం' ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురభి నాటకాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అంతరించిపోతున్న నాటక సంస్కృతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని హీరో ప్రయత్నిస్తాడు. అతనికి సపోర్ట్ చేసే పాత్రలో ప్రేయసి పాత్రలో రెజీనా నటించారు.
3/5

'ఉత్సవం' సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా విజయ దశమి సందర్భంగా ఓటీటీలోకి వచ్చింది. నాటకాల నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా, సందేశాత్మక సినిమాగా వచ్చిన 'ఉత్సవం' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
4/5

అక్టోబర్ 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఉత్సవం' స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ ఫిష్ సినిమా ద్వారా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యింది. ప్రజెంట్ జనరేషన్ చాలా మందికి నాటకం అంటే తెలియదు. అంతరించిపోతోన్న నాటక రంగం, వాటితో ముడిపడిన భావోద్వేగాలను ఈ తరానికి తగ్గట్టుగా చక్కటి కథనంతో చూపించడంతో వీక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది.
5/5

'ఉత్సవం' చిత్రానికి రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందించగా... అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో వీళ్లిద్దరి ప్రతిభ హైలైట్ అవుతోంది. నెమ్మదిగా ఈ సినిమాను జనాలు చూడటం ప్రారంభించారు.
Published at : 14 Oct 2024 07:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion