Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABP
పైడితల్లి అమ్మవారికి నిర్వహించే సిరిమానోత్సవం చూడటానికి కన్నులపండువలా ఉంటుంది. విజయనగరంలో పూసపాటి వంశీయుల ఆడపడుచుగా పూజలందుకునే పైడితల్లిని ఇక్కడి ప్రజలు ఆరాధ్యదైవంగా భావిస్తారు. మగపిల్లలకు సైతం తల్లితండ్రులు పైడితల్లి అని పేరు పెడతారంటేనే అర్థం చేసుకోవచ్చు పైడితల్లి అమ్మవారిని ఇక్కడి ప్రజలు ఎంతెలా తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారో. అలాంటి అమ్మవారికి ప్రతిరూపంగా జరిగే సిరిమానోత్సవ శోభ ఇది.
సుమారు 40 అడుగుల ఎత్తుగల సిరిమాను పీఠికపై అమ్మవారి ఆలయ అనువంశిక పూజారి అధిరోహించి కోటగుమ్మానికి మూడుమార్లు చుట్లు తిరుగుతూ చేసే ఉత్సవమే సిరిమానోత్సవం. ఈ వేడుకకు 260 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు స్థానికులు. ఇప్పటికి అనువంశిక ధర్మకర్తలుగా పూసపాటి వంశస్తులే ఈ సిరిమానోత్సవాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అనువంశిక ధర్మ కర్త అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ ఏడాది వేడుకలను దగ్గరుండి నిర్వహించారు. మరి ఈ సిరిమాను ను ఎక్కడి నుంచి తీసుకువస్తారు దీని కథ ఏంటీ..