Keerthy Suresh: మహానటి... అసలైన పరీక్ష ముందుంది మరి - ఇయర్ ఎండ్ కీర్తి సురేష్‌కు చాలా ఇంపార్టెంట్, ఎందుకో తెలుసా?
Keerthy Suresh Birthday: 'మహానటి'గా తెలుగు, తమిళంలో విజయం అందుకోవడం కాదు... కీర్తి సురేష్ ముందు అసలైన పరీక్ష ఈ ఏడాది ఆఖరులో ఉంది. అది ఏమిటో తెలుసా?
కీర్తి సురేష్ (Keerthy Suresh) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'మహానటి'. సావిత్రి పాత్రకు ఆమె అంతలా ప్రాణం పోసింది. ఈతరం చిన్నారులకు, సినిమాలు ఫాలో కాని కొంత మంది ప్రేక్షకులకు కీర్తి సురేష్ గుర్తుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 'మహానటి' ఇంపాక్ట్ అటువంటిది. ఈ నటికి అసలైన పరీక్ష ముందుంది మరి! అది ఏమిటో తెలుసా?
అక్కడ హిట్ వస్తుందా? జనాన్ని మెప్పిస్తుందా?
'మహానటి'కి ముందు, తర్వాత తెలుగులో కీర్తి సురేష్ (Keerthy Suresh Birthday)కు తెలుగులో విజయాలు లేవని కాదు... 'నేను శైలజ' వంటివి ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కీర్తి సురేష్ సినిమాలు చేశారు. స్టార్ హీరోల సరసన నటించారు. అయితే... ఈ ఏడాది ఆమెకు, ఆమె సినీ ప్రయాణానికి చాలా కీలకం కానుంది. అదీ ఎందుకో తెలుసా?
Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
సౌత్ సినీ ఇండస్ట్రీలో పాతిక పైగా సినిమాలు చేసిన కీర్తి సురేష్, ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది. 'బేబీ జాన్'తో ఆమె బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వెళుతోంది. దళపతి విజయ్ తమిళ్ హిట్ సినిమా 'తెరి' (తెలుగులో 'పోలీస్'గా విడుదల అయింది)ని హిందీలో 'బేబీ జాన్'గా రీమేక్ చేశారు. ఆ సినిమాలో వరుణ్ ధావన్ హీరో. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్లు చూస్తే మాసీగా, కొత్తగా తీశారని అర్థం అవుతోంది.
'బేబీ జాన్'తో హిందీ ప్రేక్షకుల్ని కీర్తి సురేష్ మెప్పిస్తుందా? లేదా? అక్కడ ఆవిడ హిట్ కొడుతుందా? లేదా? అనేది చూడాలి. 'బేబీ జాన్'కు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు చేశారు. షారుఖ్ ఖాన్ 'జవాన్'తో నయనతారను ఆయన హిందీ సినిమాకు పరిచయం చేశారు. ఆమెకు విజయం అందించారు. మరి, కీర్తికి ఎటువంటి విజయం అందిస్తారో చూడాలి.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
Wishing the queen #KeerthySuresh a very Happy Birthday, we cannot wait to witness you magic in #BabyJohn@MuradKhetani @priyaatlee #JyotiDeshpande @Atlee_dir @Varun_dvn @KeerthyOfficial #WamiqaGabbi @bindasbhidu @kalees_dir @sumitaroraa @MusicThaman @jiostudios @aforapple_offcl… pic.twitter.com/fBLgBliCfk
— Rajpal Naurang Yadav (@rajpalofficial) October 17, 2024