అన్వేషించండి

YSRCP News: సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్

TDP Leader Join YSRCP: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ సైలెంట్‌గా పార్టీలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి మళ్లీ ఉత్తారంధ్ర బాధ్యతలు అప్పగించారు.

TDP leader Mudunuri Murali Krishna joined In YSRCP: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలతో సమావేశం అవుతున్న ఆయన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధ్యక్షులను మార్చిన జగన్ ఇప్పుడు కోఆర్టినేటర్లను మార్చారు. సీనియర్లకు ఆ బాధ్యతలు అప్పగించారు. విజయసాయి రెడ్డికి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. 

ఇవాళ పార్టీ కీలక నేతలతో జగన్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో సాగిందీ సమావేశం. బూత్‌ లెవల్‌లో పార్టీ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేడర్‌ను మళ్లీ ఉత్సంగా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేందుకు ప్రణాళిక రచించారు. 

ఇప్పటికే మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించి కొత్త ఇన్‌ఛార్జ్‌లను జగన్ నియమించారు. ఇకపై మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని పార్టీ నేతలు కోరారు. దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా విడుదల చేయనున్నారు. 

ఈ సమావేశంలోనే ఉమ్మడి జిల్లాలను సెంట్రిక్‌గా చేసుకొని కోఆర్డినేటర్లను జగన్ నియమించారు. కొందరు సీనియర్ లీడర్‌కు రెండు జిల్లాలు మరికొందరికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డికి మాత్రమే ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లా కోఆర్డినేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఈస్ట్, వెస్ట్ గోదావరిని బొత్స సత్యనారాయణకు, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు విజయసాయిరెడ్డికి, కడప, అనంతపురం, కర్నూలును వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. 

ఇప్పటి వరకు వైసీపీ నుంచి బయటకు వెళ్లే వాళ్లనే చూశాం. ఇన్ని నెలల తర్వాత తొలిసారి అధికార పార్టీ నుంచి ఓ నేత వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణ వైసీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిసహా అన్ని పదవులకు రాజీనామా చేసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ మోహన్ రెడ్డి మురళీకృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కేడర్‌లో ఒక్కసారిగా నిస్తేజం ఏర్పడింది. అప్పడప్పుడు జగన్ బయటకు వస్తున్నప్పటికీ మునుపటి జోష్ కనిపించడం లేదు. మరోవైపు కేసుల్లో ఇరుకున్న వాళ్లు జైలుపాలు అవుతున్నారు. ఇది కూడా పార్టీలో ఓ విధమైన నిరాశకు కారణం అవుతుంది. అందుకే ఇప్పటి వరకు జిల్లా పార్టీని ప్రక్షాళన చేసిన జగన్... ఇప్పుడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు బాధ్యతలు అప్పగించిన నేతలందా ప్రజల్లో ఉండాలని జగన్ సూచించారు. వారి పని తీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకుంటామని అన్నారు. వాటి ఆధారంగానే ఆ నేతల భవిష్యత్ ఆధార పడి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

Also Read: మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget