సూర్య, జ్యోతిక లవ్ స్టోరి ఇదే.. వెడ్డింగ్ డే స్పెషల్
సూర్య జ్యోతిక జంటకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వేరు కేవలం స్టార్ కపులే కాదు సక్సెస్ఫుల్ కపుల్ కూడా.
వీరిద్దరూ లవ్ చేసుకుని సెప్టెంబర్ 11, 2006లో పెళ్లి చేసుకున్నారు. ఈరోజు వాళ్లది 18వ వెడ్డింగ్ డే. ఈ సందర్భంగా స్టార్ కపుల్ లవ్ స్టోరీపై ఓ లుక్కేసేద్దాం.
సూర్య, జ్యోతిక తమిళ్లో బ్యాక్ టూ బ్యాక్ 7 చిత్రాల్లో పనిచేశారు. దాదాపు 10 సంవత్సరాలు వారు కలిసి వర్క్ చేశారు.
షూటింగ్ సమయంలో సూర్య ఇచ్చే రెస్పెక్ట్‌కి జ్యోతిక అట్రాక్ట్ అయిందని.. ఆయన సెట్స్‌లో అందరిని చాలా గౌరవంగా ట్రీట్ చేసేవారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇద్దరి మధ్య స్నేహం పెరిగిన తర్వాత.. ఓ రోజు సూర్య ప్రపోజ్ చేశారట. ఇంట్లోవారి అనుమతితో.. ప్రపోజ్ చేసిన నెల తర్వాత వీళ్లు పెళ్లి చేసుకున్నట్లు జ్యో తెలిపింది.
పెళ్లై ఇన్ని సంవత్సరాలు అయినా.. సూర్య కేరింగ్, రెస్పెక్ట్, ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ అంతే ప్రేమను నాపై, పిల్లలపై చూపిస్తారని జ్యో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
సూర్య కూడా వీలు దొరికినప్పుడల్లా జ్యోతికపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటాడు. ఆమెను తనకు గురువు అని చెప్పిన సందర్భాలు ఎన్నో.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. వీరిద్దరూ ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసేందుకు వెనకాడరు. పైగా ఒకరికొకరు ఎప్పుడూ అండగానే ఉంటారు.
జిమ్‌కి కూడా ఇద్దరూ కలిసి వెళ్లి.. కపుల్ గోల్స్ స్ట్రాండర్డ్ని పెంచుతూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కపుల్.