Pawan Kalyan - Janasena : షూటింగులకు పవన్ కళ్యాణ్ షార్ట్ బ్రేక్ - 'జనసేన' కోసం...
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగుల నుంచి షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో వారం రోజులు రాజకీయ వేదికలపై ఆయన కనిపించనున్నారు.
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమా షూటింగుల నుంచి షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. రాబోయే నాలుగైదు రోజులు ఆయన రాజకీయ వేదికలపై కనిపించనున్నారు. ఆయన షెడ్యూల్ ఎలా ఉందంటే...
పవన్ కళ్యాణ్ శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. శనివారం సాయంత్రం బీసీ నాయకులతో మంగళగిరిలో సమావేశం అయ్యారు. ఆదివారం కూడా ఆయన మంగళగిరిలో ఉంటారు. కాపు సామజిక వర్గానికి చెందిన నాయకులతో సమావేశం ఉంది. ఈ నెల 13న సోమవారం జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం ఉంది. ఆ తర్వాత 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి రాబోయే మూడు రోజులు పవన్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ రెండు మూడు రోజుల్లో వీలు చూసుకుని కృష్ణా జిల్లాలోని కౌలు రైతుల భరోసా యాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమాల కోసం షూటింగులకు ఆయన షార్ట్ బ్రేక్ ఇచ్చారు.
Also Read : చిరంజీవి కాళ్ళ మీద పడిన వేణు - 'బలగం' బృందానికి 'మెగా'స్టార్ ప్రశంసలు
'వినోదయ సీతం' రీమేక్ షూటింగులో...
తమిళ హిట్ 'వినోదయ సీతం' తెలుగు రీమేకులో పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ నటుడు, గతంలో తెలుగులో రవితేజ 'శంభో శివ శంభో'కు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఫిబ్రవరిలో హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించారు. ఫిబ్రవరి 22న షూటింగ్ మొదలు పెడితే... రెండు మూడు రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ షూటింగ్ చేశారు.
ఒక వైపు 'వినోదయ సీతం' చిత్రీకరణ హైదరాబాదులోని ఓ స్టూడియోలో షూటింగ్ జరిగితే... మరో వైపు రామోజీ ఫిల్మ్ సిటీలో 'హరి హర వీర మల్లు' షూటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ లేకుండా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మీద క్రిష్ జాగర్లమూడి సీన్స్ తీశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. నర్గిస్ ఫక్రి కీలక పాత్ర చేస్తున్నారు.
కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. 'వినోదయ సీతమ్' తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ నటించనున్నారు. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read : వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ గోవింద - రానాను తిడుతున్న నెటిజన్లు
'వినోదయ సీతం' రీమేక్, 'హరి హర వీర మల్లు' కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమాలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది ఆయన నుంచి రెండు సినిమాలు రావచ్చని వినబడుతుంది. షూటింగ్ స్పీడ్ బట్టి రిలీజులు డిసైడ్ అవుతాయి.