By: ABP Desam | Updated at : 11 Mar 2023 03:58 PM (IST)
బలగం చిత్ర బృందంలో చిరంజీవి, కీర్తీ సురేష్
'బలగం' సినిమా విడుదలకు ముందు తెలుగు ప్రేక్షకులకు హాస్య నటుడిగా వేణు (Jabardasth Venu) తెలుసు. వెండితెరపై పలు సినిమాల్లో హీరో స్నేహితుడిగా వినోదం పంచినప్పటికీ... 'జబర్దస్త్' కార్యక్రమం ఆయనకు ఎక్కువ పేరు, గుర్తింపు సంపాదించి పెట్టింది. దాంతో 'జబర్దస్త్' వేణుగా ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అయితే, 'బలగం' సినిమా వేణులో (Venu Yeldandi Director) దర్శకుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.
కామెడీ సినిమాతో కాకుండా భావోద్వేగభరిత చిత్రంతో, కుటుంబ సంబంధాలు & గొడవల నేపథ్యంలో కథతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'బలగం' తీశారు. ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల సినిమా చూశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'భోళా శంకర్' లొకేషన్‌కు పిలిపించుకుని చిత్ర బృందాన్ని అభినందించారు.
చిరు కాళ్ళ మీద పడిన వేణు
'హాయ్ వేణు... కంగ్రాచ్యులేషన్స్! గుడ్ జాబ్' అని చిరంజీవి అభినందిస్తుంటే... ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు వేణు. 'కాదయ్యా... నువ్వు సినిమా ఇంత బాగా తీసి మాకు షాకులు ఇస్తే ఎలా చెప్పు?' అంటూ శాలువా కప్పి వేణును చిరు సత్కరించారు.
''నిజాయతీ ఉన్న సినిమా 'బలగం'. అది ట్రూ ఫిల్మ్. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా గానీ... సినిమాలో నిజాయతీ ఉంది. వేణు నిజాయతీగా తీశాడు. సినిమాకు న్యాయం చేశాడు. చాలా బావుంది. మంచి నేటివిటీ, తెలంగాణ సంస్కృతిని వంద శాతం చూపించాడు. అతను చిన్నతనం నుంచి చూసిన ప్రతిదీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యింది. ఒకసారి 'జబర్దస్త్'లో ఒగ్గు, బుర్ర కథలు వంటివి తీసుకుని స్కిట్ చేశాడు. నేను అది చూశా. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి అతని మీద గౌరవం పెరిగింది. అతనిలో అంత టాలెంట్ ఉందా? అనుకున్నా. ఈ సినిమా చూసిన తర్వాత... గొప్పగా తీశాడని అనుకున్నా'' అని చిరంజీవి చెప్పారు.
Also Read : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్
A mega moment for team #Balagam!
— Dil Raju Productions (@DilRajuProdctns) March 11, 2023
Thank you megastar @KChiruTweets Garu for your kind words! This means the world to us❤❤@OfflVenu @priyadarshi_i @KavyaKalyanram @dopvenu @LyricsShyam #BheemsCeciroleo @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka pic.twitter.com/piPOsVan5K
చిరంజీవికి అన్నయ్య కుమారుడు హర్షిత్ రెడ్డి, కుమార్తె హన్షిత రెడ్డి, 'బలగం' చిత్ర బృందాన్ని 'దిల్' రాజు పరిచయం చేశారు. ప్రియదర్శి, హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్, గేయ రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు చిరును కలిశారు. 'భోళా శంకర్'లో నటిస్తున్న కీర్తీ సురేష్, రఘుబాబు తదితరులు సైతం 'బలగం' బృందాన్ని చిరు అభినందించినప్పుడు అక్కడ ఉన్నారు.
'బలగం' సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. తాతయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి నటించారు. ఈ ముగ్గురితో పాటు ప్రతి పాత్రకు ఆర్టిస్టులు ప్రాణం పోశారు. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్ రాసిన పాటలు, భీమ్స్ అందించిన బాణీలు ఎంతో బలంగా నిలిచాయి. కథలో ఆత్మను ఆవిష్కరించాయి. సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీలోనూ చూస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి.
'బలగం' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. ఏప్రిల్ తొలి వారంలో సినిమా స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం.
Also Read : మగువ మీద మదము చూపే జన్మ దేనికి? - మృగాళ్లను ప్రశ్నించిన పాట
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు థాంక్యూ సో మచ్ సార్ నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు ఇది నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి
— Venu Yeldhandi #BalagamOnMarch3 (@OfflVenu) March 11, 2023
Thank you megastar @KChiruTweets Garu for your kind words ! pic.twitter.com/WkeNJ48e3j
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !