News
News
X

Rana Naidu Trolls : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్

నెట్‌ఫ్లిక్స్‌లో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ విడుదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుగు ప్రేక్షకులకు షాకుల మీద షాకులు తగిలాయి. సిరీస్ ఎలా ఉందనేది చెప్పడం మానేసి ఫ్యామిలీతో చూడవద్దని ట్వీట్లు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati)కి ఫ్యామిలీ హీరో అని ఇమేజ్ ఉంది. మన తెలుగులో 35 ఏళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. ఆయన కెరీర్ చూస్తే ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి. అటువంటి వెంకటేష్ తన ఇమేజ్ దాటి బయటకు వచ్చి 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది. ఇది చూసి షాక్ తినడం తెలుగు ప్రేక్షకుల వంతు అయ్యింది. 

'రానా నాయుడు' వెబ్ సిరీస్ విడుదలకు ముందు సంగతి... ముంబైలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగు మీడియా నుంచి కొంత మందిని అక్కడికి తీసుకు వెళ్లారు. అప్పుడు ''వెంకటేష్ అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు నేను ఒక మాట చెబుతాను. ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేష్ సినిమా చూస్తారు. ఈ సిరీస్ మాత్రం మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరిగా చూడండి. సపరేట్ సపరేట్ నెట్‌ఫ్లిక్స్‌ కనెక్షన్స్ తీసుకుని చూడండి'' అని రానా చెప్పారు. ఆయన ఎలా ఎందుకు చెప్పారో 'రానా నాయుడు' ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థం అయ్యింది.
 
ఆ బూతులు ఏంటి?
సెమీ న్యూడ్ సీన్స్ ఏంటి?
వెంకటేష్ ఇమేజ్ పక్కన పెట్టడం సంగతి అటు ఉంచితే... 'రానా నాయుడు'లో బూతు డైలాగులు, సెమీ న్యూడ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫక్తు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తరహాలో తీశారు. ఫ్యామిలీతో సిరీస్ చూడవద్దని, సపరేటుగా చూడమని రానా చెప్పిన మాటలు ఎక్కువ మందికి చేరలేదు. వెంకటేష్ ఉన్నాడనే ధైర్యంతో ఫ్యామిలీతో చూద్దామని సిరీస్ స్టార్ట్ చేసిన జనాలకు షాక్ మీద షాక్ తగిలింది. దయచేసి ఫ్యామిలీతో చూడవద్దని ట్వీట్లు చేయడం స్టార్ట్ చేశారు. అసలు, ఆ కంటెంట్ ఏమిటంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'రానా నాయుడు' వెబ్ సిరీస్ చూసిన తెలుగు ప్రేక్షకులు బాలేదని చెబుతున్నారు. వెంకటేష్ అభిమానులు అయితే ఆయన్ను అటువంటి క్యారెక్టర్ చేయడం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ పాత్రలో ఆయన్ను చూడలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. తెలుగు ప్రేక్షకుల నుంచి 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నెగిటివ్ టాక్ అందుకుంది. ట్విట్టర్ ట్రెండ్స్ చూస్తుంటే తెలుగు జనాలు సిరీస్ చూడటం కష్టమే. అసలే తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్స్ ఉన్న జనాలు తక్కువ. ఈ రేంజ్ ట్రోలింగ్ వస్తే ఇంకా ఎందుకు తీసుకుంటారు?

బాలకృష్ణతో చెప్పింది కరెక్టే!
''అన్‌స్టాపబుల్'లో 'రానా నాయుడు'లో బూతులు పండగ అంట కదా!'' అని నట సింహం బాలకృష్ణ అడిగారు. ''బాబాయ్ చేత తెలుగులో బూతులు మాట్లాడించలేక హిందీకి తీసుకువెళ్ళి మాట్లాడించాం'' అని రానా చెప్పారు. ఇప్పుడీ షో చూస్తే అది నిజమేనని తెలుస్తోంది. 

Also Read : బాలకృష్ణ వస్తేనే తాళి కడతా - మూడేళ్ళుగా వాయిదా పడుతున్న పెళ్ళికి బాలయ్య వస్తారా?

సాధారణంగా హిందీ వెబ్ సిరీస్, సినిమాల్లో అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కొన్ని తెలుగు సినిమాల్లో కూడా అడల్ట్ కంటెంట్ ఉంటోంది. అయితే, వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో అటువంటి కంటెంట్ ఉన్న సిరీస్ చేయడాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అదీ సంగతి! దీనికి వెంకటేష్ ఏమైనా స్పందిస్తారో? లేదో? వెయిట్ అండ్ సి! 

Also Read : మగువ మీద మదము చూపే జన్మ దేనికి? - మృగాళ్లను ప్రశ్నించిన పాట

Published at : 11 Mar 2023 11:22 AM (IST) Tags: Venkatesh Daggubati Rana Naidu Web Series Rana Naidu Trolls Satires on Venkatesh

సంబంధిత కథనాలు

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు