అన్వేషించండి

Kamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్

 కోల్ కతా నైటర్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ విచిత్రం జరిగింది. సన్ రైజర్స్ తరపున తొలిసారి బరిలోకి దిగిన శ్రీలంక యువ ఆల్ రౌండర్ కమిందు మెండిస్ ఓ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్ లో రెండు చేతులతోనూ బౌలింగ్ చేశాడు కమిందు. 13వ ఓవర్ లో రెండో బంతిని లెఫ్ట్ హ్యాండరైన వెంకటేష్ అయ్యర్ కు కుడి చేత్తో బౌలింగ్ చేసిన కమిందు...తిరిగి అదే ఓవర్లో నాలుగో బంతిని కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తున్న రఘువంశీకి ఎడమచేత్తో వేశాడు. అంతే కాకుండా ఆ బంతికి రఘువంశీ వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ తరహా బౌలింగ్ చేస్తూ ఐపీఎల్ లో వికెట్ సాధించిన తొలి బౌలర్ గా నూ రికార్డులకెక్కాడు కమిందు మెండిస్. ఇలా రెండు చేతులతోనూ నైపుణ్యం కలిగి ఉండటాన్ని యాంబీడెక్ట్రాస్ అంటారు. తెలుగులో ఇంచుమించుగా సవ్యసాచి అనుకోవచ్చు. వీళ్ల రెండు చేతులకూ ఒకే తరహా సామర్థ్యం, నైపుణ్యం ఉంటుంది. ప్రపంచంలో ఇలా యాంబీడెక్ట్రాస్ అయ్యి రెండు చేతులతోనూ ఒకేలా పనిచేయింగలిగే నైపుణ్యం కలిగిన వారు కేవలం ఒక శాతం మాత్రమే ఉంటారట. అలాంటి ఒక శాతం మనుషుల్లో ఒకడే కమిందు మెండిస్. బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ చేసే ఈ కుర్రాడు..20 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్ తో 27 పరుగులు కూడా చేశాడు సన్ రైజర్స్ కు. బ్యాటింగ్ లో స్విచ్ షాట్ ఆడే బ్యాటర్లను చూసి ఉంటాం కానీ ఇలా ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేయగల నైపుణ్యం బౌలర్లు అత్యంత అరుదు. లెఫ్ట్ హ్యాండ్ తో ఆడే బ్యాటర్లకు రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తూ..రైట్ హ్యౌండ్ తో ఆడే క్రికెటర్లకు లెఫ్ట్ హ్యాండ్ తోబౌలింగ్ చేసే అలవాటున్న ఈ 26ఏళ్ల కుర్రాడు శ్రీలంకకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ ఆడేస్తున్నాడు.  ప్రస్తుతం లైమ్ లైట్ లో క్రికెటర్లలో ఈ తరహా సవ్యసాచి బౌలర్ అయితే కమింద్ మెండిస్ మాత్రమే ఉన్నాడు. అందుకే 18సంవత్సరాల చరిత్ర ఐపీఎల్ లో ఇలా బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా నిలవటమే కాదు వికెట్ కూడా తీసి చరిత్ర సృష్టించాడు కమిందు మెండిస్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
ABP Premium

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget