Angkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీ
ఆంగ్ క్రిష్ రఘువంశీ. ఇప్పుడే టీనేజ్ దాటి 20వ పడిలోకి అడుగుపెడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్. కిందటేడాదే ఐపీఎల్ లో కి అరంగేట్రం చేసి ఆడిన ఫస్ట్ సీజన్ లోనే హాఫ్ సెంచరీ కొట్టిన రఘువంశీ చాలా ప్రామిసింగ్ గా కనిపించి ఈ సీజన్ లోనూ కేకేఆర్ తరపున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 151 కెరీర్ స్ట్రైక్ రేట్ తో ఆడే రఘువంశీ నిన్న సన్ రైజర్స్ తో మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ బాదేశాడు. ముందు రహానే తో కలిసి తర్వాత వెంకటేశ్ అయ్యర్ తో కలిసిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఆటాడుకున్నాడు టీనేజర్ ఆంగ్ క్రిష్ రఘువంశీ. 32 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి కామిందు మెడిస్ బౌలింగ్ లో అవుటైపోయాడు. రఘవంశీ కెరీర్ లో ఇది రెండో హాఫ్ సెంచరీ. రెండు కేకేఆర్ తరపునే కొట్టాడు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొట్టిన రెండు హాఫ్ సెంచరీలను ఒకే రోజు సాధించటం. 2024 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ మీద మ్యాచ్ లో బరిలోకి దిగిన రఘువంశీ 27బంతుల్లోనే 54 పరుగులు చేసి తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మళ్లీ ఏడాది తర్వాత అదే ఏప్రిల్ 3న ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పై 32 బాల్స్ లో హాఫ్ సెంచరీ కొట్టి సరిగ్గా ఏడాది మారిన అదే రోజు హాఫ్ సెంచరీ ఇలాంటి ఫీట్ సాధించిన తొలి ఐపీఎల్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు రఘువంశీ. ఇంకా చిన్న కుర్రాడే కాబట్టి ఇలాగే దుమ్మురేపితే బోలెడు ఫ్యూచర్..టీమిండియాలో స్థానం పక్కా అని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు క్రికెట్ ఎక్స్ పర్ట్స్.





















