AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
Andhra : ఏపీలో కూటమి నేతలకు మార్కెట్ యార్డ్ పదవులను ప్రకటించారు. త్వరలో ఆలయ పాలక మండళ్ల పదవులను ప్రకటించనున్నారు.

Market yard posts: తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల మరో జాబితాను ప్రకటించింది. మొత్తం 38 మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు. అలాగే వాటికి పాలక మండళ్లకూ పదవులు ఇచ్చారు. ఈ జాబితాలో బీజేపీకి ఒక్క చోట అవకాశం కల్పించారు. జనసేన పార్టీకి చెందిన వారికి ఆరుగురికి అవకాశం ఇచ్చారు.
వరుసగా పదవుల్ని భర్తీ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు
కొద్ది రోజులకిందటే 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవులను భర్తీచేసింది. ఇందులో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. ప్పటికే 62 కార్పొరేషన్ పోస్టులు భర్తీ అయ్యాయి. వీటిని టీడీపీ 49, జనసేన 10, బీజేపీ 3 చొప్పున పంచుకున్నారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డ్స్‌లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అంటే 1314 పోస్టులు ఉన్నాయి. వీటికోసం ఏకంగా 60 వేల అప్లికేషన్లు వచ్చాయి. తొలి విడతగా 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్నిప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశాలు కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించారు. కష్టపడిన వారి గుర్తింపు కోసం ప్రతయేకంగా కసరత్తు చేశారు. ఇంక ఆలయ పాలక మండళ్ల కు పదవులను ప్రకటించాల్సి ఉంది. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్‌లను నియమించాల్సి ఉంది.
పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశాలు
నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు ఇటీవల సీఎం చంద్రబాబు తెలిపారు. . మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు. రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే పదవులు తీసుకున్నవారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామన్న బాబు.. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు హుందాగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కొన్ని పదవులు ప్రకటించినా ఇంకా భర్తీ చేయాల్సిన పదవులు పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఫార్ములా ప్రకారమే పదవుల పంపిణీ
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే పోస్టుల భర్తీలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. కష్టకాలంలోనూ టీడీపీను అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు. కొందరు అతి సామాన్యులను పదవులతో గౌరవించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే, యువతకు ప్రాధాన్యమిచ్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. . క్యాడరే లీడర్ అనే సందేశం ఇస్తూ అంకితభావం ఉన్న వారికి అందలం ఎక్కించింది. సామాన్య కార్యకర్తలు పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చింది. సామాజిక సమతూకంతోపాటుగా యువతకు ప్రాధాన్యం కల్పించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.





















