News
News
X

Venkatesh Criticized : వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ గోవింద - రానాను తిడుతున్న నెటిజన్లు 

కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మారుతుంది. కాలంతో పాటు కొందరు మారే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలకు అందరి నుంచి ఆమోదముద్ర పడుతుందని ఆశించలేం. అందుకు ఉదాహరణ 'రానా నాయుడు'లో వెంకటేష్ రోల్.

FOLLOW US: 
Share:

'ప్రతి 30 ఏళ్ళకు బతుకు తాలూకూ ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు' అని 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో త్రివిక్రమ్ ఓ మాట రాశారు. బతుకు తాలూకూ ఆలోచన 30 ఏళ్ళకు మారుతుందో? లేదో? గానీ, సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతూ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే... స్టార్ హీరోలు ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు చేయడం!

మూడు దశాబ్దాలుగా క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ మీద కెరీర్ బండి లాగిస్తున్న వెంకటేష్ (Venkatesh) ఆలోచన మారిందో? మరొకటో? ఆయన ఓ వెబ్ సిరీస్ చేశారు. ప్రతి మనిషి కాలంతో పాటు మారుతూ ఉంటారు. మారడంలో తప్పు లేదు గానీ, ఆ మార్పు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా ఉంటే సభ్య సమాజం నుంచి ఆమోదముద్ర పడుతుందని చెప్పలేం. అందుకు, ఉదాహరణ 'రానా నాయుడు'లో వెంకటేష్. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని చూడలేదు. ఆల్రెడీ ఉన్న ట్రెండ్ ఫాలో అయ్యారు. 
  
ఓటీటీలో ట్రెండ్ ఏమిటంటే... అడల్ట్ సీన్లు, సెన్సార్ చేయని బూతు డైలాగులు ఉన్న కథలు తెరకెక్కించడం! హిందీలో సూపర్ హిట్ అయిన 'మిర్జాపూర్', 'సేక్రెడ్ గేమ్స్', 'పాతాళ్ లోక్', 'ఆశ్రమ్' వంటివి అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ 'రానా నాయుడు'తో సహా! ఇందులో వెంకటేష్ చేత బూతు డైలాగులు అలవోకగా చెప్పించారు. 

వెంకటేష్ రీల్ లైఫ్ ఇమేజ్ మాత్రమే కాదు... రియల్ లైఫ్ ఇమేజ్ కూడా క్లీన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి వివేకానంద, రమణ మహర్షిలకు ఫాలోవర్ అని చాలా మంది ప్రేక్షకులకు, అభిమానులకు తెలుసు. ఆయన్ను అభిమానించడానికి అదీ ఓ కారణం. అయితే... వాళ్ళందరూ వెంకీని ఊర మాస్ అవతారంలో చూడటానికి ఇబ్బంది పడుతున్నారు. 'రానా నాయుడు'తో 30 ఏళ్ళుగా ఆయన సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం ఒక్కసారిగా నాశమైందని బాధ పడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెంకటేష్ గారితో ఇటువంటి సిరీస్ ఏంటని ఒకరు ట్వీట్ చేశారు.

Also Read చిరంజీవి కాళ్ళ మీద పడిన వేణు - 'బలగం' బృందానికి 'మెగా'స్టార్ ప్రశంసలు  

కంటెంట్ మొత్తం బూతులు అయితే?
వెంకటేష్ క్యారెక్టర్, 'రానా నాయుడు' సిరీస్... రెండిటికీ నెగిటివ్ టాక్ వచ్చింది. ఓ నెటిజన్ 'కంటెంట్ మధ్యలో బూతులు ఉంటే పర్వాలేదు. కానీ, కంటెంట్ మొత్తం బూతులు, సె... అయితే బోర్ కొడుతుంది కదా' అని ట్వీట్ చేశారు. మా హీరో వెంకటేష్ నుంచి ఇటువంటి సిరీస్ ఆశించలేదని ఇంకొకరు ట్వీట్ చేశారు. సిరీస్ అంటే బూతులు మాట్లాడాలని ఫాలో అయిపోతున్న టీమ్ అని మరొకరు ట్వీట్ చేశారు. తెలుగు వాళ్ళకి ఈ సిరీస్ కల్చరల్ షాక్ అని ఇంకొకరు పేర్కొన్నారు. వెంకీ మామను అటువంటి పాత్రలో చూసి డిజప్పాయింట్ అయ్యానని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

రానాను తిడుతున్న నెటిజన్లు
ఇటువంటి క్యారెక్టర్లు చేయవద్దని వెంకటేష్ ను ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేశారు. రానాకు ఎటువంటి విలువలు లేవని, అతను ఇటువంటి క్యారెక్టర్లు చేస్తాడని, ఫోర్స్ చేసి వెంకటేష్ చేత ఆ క్యారెక్టర్ చేయించి ఉంటాడని రానా మీద తప్పును తోసేయడం గమనార్హం.

Also Read : బాలకృష్ణ వస్తేనే తాళి కడతా - మూడేళ్ళుగా వాయిదా పడుతున్న పెళ్ళికి బాలయ్య వస్తారా?

'అర్జున్ రెడ్డి', 'ఆర్ఎక్స్ 100' చూసిన కళ్ళు... 'రానా నాయుడు'లో వెంకటేష్ (Venaktesh Criticized) ను ఆ విధమైన పాత్రలో చూడలేకపోతున్నాయని ఒకరు ట్వీట్ చేశారు. ఉత్తరాది ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీసిన సిరీస్ కనుక అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 'రానా నాయుడు' సిరీస్, వెంకటేష్ నిర్ణయానికి మద్దతు పలుకుతూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.   

Published at : 11 Mar 2023 03:19 PM (IST) Tags: Rana Naidu Web Series Venkatesh Fans Disappointed Venkatesh Criticised Venkatesh Trolls

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే