అన్వేషించండి

Robin Hood Trailer: 'రాబిన్ హుడ్' ట్రైలర్ రిలీజ్ వాయిదా - నితిన్, వెంకీ కుడుముల ఫన్నీ వీడియో.. వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ ఎప్పుడంటే..?

Nithiin Movie: నితిన్, వెంకీ కుడుముల కాంబోలో లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. ఈ మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల ఈ నెల 23న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Nithiin's Robinhood Movie Trailer Release Latest Date: యంగ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' (Robinhood). ఈ నెల 28న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా.. 21న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అయితే, కొన్ని అనివార్య, సాంకేతిక కారణాలతో ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేయడం లేదని ప్రకటించింది. 

ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 23న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం వెల్లడించింది. 'ఊహించని పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా ఈ రోజు ట్రైలర్ విడుదల కావడం లేదు. మార్చి 23న గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. ఈ సమయం వేచి ఉండడానికి విలువైనది. మీ అంచనాలను అలానే ఉంచండి.' అని పేర్కొంది.

Also Read: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కుమార్తె మూవీ - 'గాందీ తాత చెట్టు' స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా..?

ఫన్నీ వీడియోతో..

అయితే, ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయాన్ని హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ఓ ఫన్నీ వీడియోతో డిఫరెంట్‌గా చెప్పారు. 'చెప్పిన టైంకు ఎప్పుడైనా కంటెంట్ రిలీజ్ చేశారా..?' అని ఏఐ కామెంట్స్ రూపంలో అడుగుతున్నట్లు ఉండగా.. 'మీరే హ్యాండిల్ చెయ్యండన్నా' అంటూ వెంకీ నితిన్‌కు చెప్తారు. ఈ క్రమంలోనే కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా వీడియోలో ప్రత్యక్షమవుతాయి.

వార్నర్ చేతుల మీదుగా..

ఈ ఫన్నీ కామెంట్స్ నడుమ.. ఫైనల్‌గా నితిన్, వెంకీ కలిసి ట్రైలర్ లాంఛ్ ఈ నెల 23న ఉంటుందని తెలిపారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

భీష్మ' వంటి హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో క్రికెటర్ వార్నర్ కనిపించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 28న మూవీ థియేటర్లలోకి రానుంది. మరోవైపు, ఈ మూవీలో 'అది దా సర్ ప్రైజు' సాంగ్ స్టెప్పులపై విమర్శలు రాగా.. నితిన్ స్పందించారు. తాము అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
Andhra Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
Brave Woman Dead: మంటల్లో కాలిపోతూ ఆస్పత్రికి వచ్చింది - అంత ధైర్యం ప్రాణాల్ని కాపాడలేకపోయింది!
మంటల్లో కాలిపోతూ ఆస్పత్రికి వచ్చింది - అంత ధైర్యం ప్రాణాల్ని కాపాడలేకపోయింది!
Nepal Protests: నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
Andhra Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
Brave Woman Dead: మంటల్లో కాలిపోతూ ఆస్పత్రికి వచ్చింది - అంత ధైర్యం ప్రాణాల్ని కాపాడలేకపోయింది!
మంటల్లో కాలిపోతూ ఆస్పత్రికి వచ్చింది - అంత ధైర్యం ప్రాణాల్ని కాపాడలేకపోయింది!
Nepal Protests: నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Trisha Krishnan Tattoo: భుజంపై టాటూ చూపించిన త్రిష... ఆ టాటూ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
భుజంపై టాటూ చూపించిన త్రిష... ఆ టాటూ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
India Neighboring Countries: భారత పొరుగు దేశాల్లో  కూలిపోతున్న ప్రభుత్వాలు, పారిపోతున్న ప్రధానులు -  ఏదైనా కుట్ర ఉందా ?
భారత పొరుగు దేశాల్లో కూలిపోతున్న ప్రభుత్వాలు, పారిపోతున్న ప్రధానులు - ఏదైనా కుట్ర ఉందా ?
Nepal PM step down: కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్ - నేపాల్ కకావికలం - ప్రధానితో రాజీనామా చేయించిన ఆర్మీ
కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్ - నేపాల్ కకావికలం - ప్రధానితో రాజీనామా చేయించిన ఆర్మీ
Alert for Hyderabad: ఎండలు మండుతున్నాయి కానీ సాయంత్రానికి ఉరుముల వర్షాలు - భారీగానే -ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎండలు మండుతున్నాయి కానీ సాయంత్రానికి ఉరుముల వర్షాలు - భారీగానే -ఈ జాగ్రత్తలు తీసుకోండి
Embed widget