South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. సౌత్ ఆఫ్రికా ను 342 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డులు తిరగరాసింది ఇంగ్లాండ్. ఇది ODI క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా టీం సాధించిన అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 414 పరుగులు చేసింది.
ఛేజింగ్ మొదలు పెట్టిన సౌత్ ఆఫ్రికా పోరాడకుండానే చేతులెత్తేసింది. 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు సఫారీలు. 342 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో అతిపెద్ద ఓటమిని చవిచూసిన టీమ్ గా చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
ఇంతకు ముందు ఈ రికార్డు భారత్ పేరిట ఉండేది. 2023లో శ్రీలంకను 317 పరుగుల తేడాతో ఓడించింది టీమ్ ఇండియా. వన్డే చరిత్రలో ఒక జట్టును ఒకటి కంటే ఎక్కువసార్లు 300 లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడించిన ఏకైక దేశం భారత్. టీమ్ ఇండియా రెండుసార్లు ఈ ఘనతను సాధించింది.




















