అన్వేషించండి

Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam

 మనందరం నైట్ ఆకాశంలోకి చూస్తున్నప్పుడు చాలా వింత వింత ప్రశ్నలు మన మైండ్ లో తడుతూ ఉంటాయి కదా. అసలు ఆ నక్షత్రాలు ఆకాశంలో అలా ఎలా వేలాడుతున్నాయి. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే..చంద్రుడు భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాడు ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాం కదా. కానీ మోడ్రన్ సైన్స్ ఇవాల్వ్ అయ్యాక తెలిసిందేంటీ ఏంటీ అంటే మన భూమి లాంటి గ్రహాలు..సూర్యుడు లాంటి నక్షత్రాలు..ఆఖరకు ఈ ఎంటైర్ గెలాక్సీ కూడా అలా ఊరికే గాల్లో వేలాడటం లేదు. అవి స్పేస్ టైమ్ క్రియేట్ చేస్తూ ఫ్లోట్ అవుతున్నాయి. అసలేంటీ స్పేస్ టైమ్..దీన్ని అర్థం చేసుకోవటానికే పుట్టిన స్పేస్ ఫ్యాబ్రిక్ కాన్సప్ట్ ఏంటీ ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం.

1905 వరకూ మన సైంటిస్టులు కాలం అనేది విశ్వమంతా ఒకటే అనుకునే వారు. అంటే ఇవాళ హైదరాబాద్ లో ఎలా అయితే మనం టైమ్ చూసుకుంటున్నామో అలాగే సూర్యుడి మీద చంద్రుడి మీద మార్స్ మీద కూడా ఒకే రకంగా టైమ్ ఉంటుంది అనుకునే వారు. అది కరెక్టే కానీ ఆ గ్రహాల మీద టైమ్... మన టైమ్ ఒక్కటి కాదు..ఒక్కలా ఉండదు అని తర్వాత తర్వాత అర్థమైంది.

ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ మీద హైదరాబాద్ లో ఓ ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్తున్నాను అనుకుందాం. నా ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని పాటలు వింటున్నాడు అనుకుందాం. టైమ్ గడవటాన్ని నేను ఎక్స్ పీరియన్స్ చేసే విధం వేరు..ఇంట్లో కూర్చున్న నా ఫ్రెండ్ ఎక్స్ పీరియన్స్ చేయటం వేరు. బైక్ మీద వేగంగా వెళ్తున్న నా చేతి వాచిలోని గడియారం నెమ్మదిగా కదులుతుంది...ఇంట్లో కూర్చున్న నా ఫ్రెండ్ చేతికున్న గడియారం వేగంగా కదులుతుంది. అయితే ఏదో పెద్ద మనం గమనించేంత తేడా ఉండదు కానీ నానో సెకన్స్ లెవల్లో అయితే ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు అదే నా ఫ్రెండ్  లైట్ స్పీడ్ తో స్పేస్ లో కనుక ట్రావెల్ చేస్తుంటే వాడి టైమ్ ఎప్పటికీ గడవదు. అట్లీస్ట్ కాలం గడుస్తున్న వేగాన్ని వాడు ఎక్స్ పీరియన్స్ చేయలేడు.

సరిగ్గా ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ ఐన్ స్టైన్ 1905లో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ని ప్రపోజ్ చేశాడు. దీని ప్రకారం స్పీడ్ ఆఫ్ లైట్ అనేది విశ్వమంతా ఒకటే. మనం ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాం అనే దాన్ని బట్టి టైమ్ కూడా వేగంగా కదలటం..నెమ్మదిగా కదలటం ఉంటుంది అని భావించారు. దీన్నే టైమ్ డయలేషన్ అంటారు.

కానీ 10 సంవత్సరాల పరిశోధనల తర్వాత మళ్లీ ఐన్ స్టైన్ సరికొత్త ప్రతిపాదనతో వచ్చారు. ఈ విశ్వంలో కాలం అన్ని చోట్లా ఒకేలా ఉంటుందని అనుకోవటం సరికాదన్న ఐన్ స్టైన్..విశ్వంలో ఆయా గ్రహాలు, ఆయా నక్షత్రాల ఉన్న గ్రావిటీ ఆధారంగా టైమ్ కూడా బెండ్ అవుతుందని 1915లో సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్నే జనరల్ థియరీ రిలేటివిటీ అంటారు. 

ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు అంత ఈజీగా అర్థం అయ్యేవి కాదు అనే భావన అప్పటి నుంచే ప్రజల్లో ఉన్నా కొంత మంది ఔత్సాహికులు మాత్రం...ఐన్ స్టైన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలపై ప్రయోగాలు చేస్తూ వచ్చారు. 1971 లో జరిగిన ఓ ప్రయోగాం ఐన్ స్టైన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. హాఫెల్ అనే భౌతిక శాస్త్రవేత్త, కీటింగ్ అనే ఖగోళ శాస్త్రవేత్త ఇద్దరూ కలిసి మూడు అటామిక్ గడియారాలు తయారు చేయించి..ఒకటి అమెరికాలో ఉంచి మిగిలిన రెండు గడియారాలను చెరో విమానంలో పెట్టి ప్రపంచమంతా చుట్టి వచ్చారు. ఒక విమానం తూర్పు దిశగా ప్రపంచమంతా తిరిగివస్తే ఇంకో విమానం పశ్చిమ దిశగా ప్రపంచమంతా తిరిగి వచ్చింది. వచ్చాక అమెరికాలో పెట్టిన గడియారం..ఈ విమానాల్లో తిరిగొచ్చిన రెండు గడియారాల్లోని టైమ్ చూస్తే ఆశ్చర్యకరంగా మూడు వేర్వేరుగా రీడింగ్స్ ఉన్నాయి. అంటే విమానాల వేగం, అవి ప్రయాణించిన దిశల ప్రభావం అన్నీ కూడా గడియారంలో కాల గమనంపై ప్రభావం చూపించాయని..ఫలితంగా ఐన్ స్టైన్ చెప్పిన థియరీస్ కరెక్ట్ అని ధ్రువీకరించాయి.

అలా ప్రయోగాలు చేస్తూ శాస్త్రవేత్తలు కాలాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో నుంచి పుట్టినదే స్పేస్ ఫ్యాబ్రిక్. అంటే విశ్వంలో మనకు కనిపిస్తున్న ఏ మ్యాటర్ అయినా కూడా తనకంటూ ఓ స్పేస్ టైమ్ ను క్రియేట్ చేసుకుంటుంది. అది ఉన్న మాస్ ఆధారంగా అది కదులుతున్న మార్గంలో ఇలా ఓ వంపును క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు ఈ విశ్వమంతా ఓ క్లాత్ పరుచుకుందని మనం భావిస్తే మాస్ ఆధారంగా భూమి…. ఇలా స్పేస్ ఫ్యాబ్రిక్ లో వంపును సృష్టిస్తుందన్నమాట. భూమి కంటే పెద్దదైన సూర్యుడు ఇలా ఇంకా లోతుగా ఆ ఒంపును క్రియేట్ చేస్తే...సూర్యుడి కంటే ఎన్నో లక్షల కోట్ల రెట్లు మాస్ ఉండే బ్లాక్ హోల్ మనం ఊహించలేనంత వంపును ఇ క్రియేట్ చేస్తుంది. సో సూర్యుడు క్రియేట్ చేసే ఆ ఒంపులో భూమి జారిపోకుండా ఉండాలంటే సూర్యుడి గ్రావిటీ నుంచి తప్పించుకనేంత వేగంతో భూమి తిరుగుతూ ఉండాలి. కాంతి కూడా దీని నుంచి తప్పించుకోలేదు. అందుకే ఆ కర్వ్ లోకి బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. బట్ బ్లాక్ హోల్ చాలా మాసివ్ మాస్ తో ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రమే లైట్ ట్రావెల్ చేయలేదు.

 సో ఇలా గ్రావిటీ ఆధారంగా..ఆ కర్వ్ ఆధారంగా సమయం విశ్వమంతా ఒక్కలా ఉండదని.. ఒక్కో చోట కాలం ఒక్కోలా ఉంటుందని అంచనాకు వచ్చారు. సో స్పేస్ టైమ్ ను క్రియేట్ చేసే కర్వ్స్ లా మన గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఆకాశంలో అలా వేలాడుతూ ఉండకుండా స్పేస్ ఫ్యాబ్రిక్ పైన తేలుతున్నట్లుగా ఉంటూ… లైట్ ను కూడా డిసైడ్ చేసేంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి.

ప్రపంచం వీడియోలు

Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
IndiGo Flights Cancelled : ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Akhanda 2 Postponed : డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
India vs SA 3rd ODI : విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
Embed widget