Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్ తో పాటు టీ20 ఫార్మట్స్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్ 2027 ఆడాలనే ఆలోచనతో కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. రోహిత్ విరాట్ ఇద్దరు కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడారు. ఆ తర్వాత ఐపీఎల్. అయితే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో వీళ్లిద్దరు ఆడబోతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా వన్ డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాస్ అయ్యారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కంటే ముందే.. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా-ఏతో.. ఇండియా-ఏ మూడు వన్డేలు ఆడనుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2027 లో చోటు సంపాదించాలంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ప్లేయర్స్ రాణించడం చాలా ఇంపార్టెంట్. దాంతో దీంతో ఈ సిరీస్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.



















