Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
హిందూపురం ఎమ్మెల్యే, లెజండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ట్రేడింగ్ బెల్ ను మోగించే అరుదైన గౌరవం బాలయ్యకు దక్కింది. దక్షిణ భారత దేశం నుంచి ఇలాంటి అరుదైన అవకాశం పొందిన మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా బాలకృష్ణ రికార్డు సృష్టించారు. బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా ఉన్న బాలయ్యను, ఆయన ఆసుపత్రి బృందాన్ని NSE అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్టాక్ మార్కెట్ ట్రేడ్ సెంటర్ ను మొత్తం తిప్పి చూపించిన అధికారులు.మార్కెట్ ఓపెనింగ్ సమయంలో బెల్ మోగించే అవకాశం కల్పించారు. బాలయ్య కొట్టిన బెల్ తోనే ఇవాళ ట్రేడింగ్ సెషన్ మొదలైంది. NSE ట్రేడ్ మార్క్ బిగ్ బుల్ దగ్గర బాలయ్య ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. గతంలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఇలాంటి గౌరవాలు పొందారు, కానీ సౌత్ నుండి బాలయ్యే మొదటి హీరో.





















