India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
హాకీ ఆసియా కప్ టైటిల్‌ను భారత్ సాధించింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత్ విజేతగా నిలిచింది. భారత్ ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకోవడం ఇది నాలుగోసారి. దీంతో 2013 ఫైనల్‌లో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. 12 ఏళ్ల కిందట దక్షిణ కొరియా 4-3 తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.
మ్యాచ్ ప్రారంభంలోనే సుఖ్‌జీత్ సింగ్ గోల్ చేయడంతో ఇండియా దూకుడుగా ఆడింది. మొదటి క్వార్టర్లోనే భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించినా గోల్ గా మలచలేకపోయారు. రెండవ క్వార్టర్ ప్రారంభంలోనే జుగ్‌రాజ్ సింగ్‌ను 2 నిమిషాల పాటు సస్పెండ్ చేసి బయటకు పంపారు. ఇండియా 10 మంది ఆటగాళ్లతో ఆడినా, దక్షిణ కొరియా జట్టు గోల్ చేయలేకపోయింది. రెండవ క్వార్టర్‌లో
టీమిండియా తరపున సుఖ్‌జీత్ సింగ్, అమిత్ రోహిదాస్ ఒక్కో గోల్ చేయగా, దిల్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేశాడు. గత 31 సంవత్సరాలలో హాకీ ఆసియా కప్ టైటిల్‌ను భారత్, దక్షిణ కొరియా కాకుండా మరే ఇతర జట్టు గెలవలేదు. గత 9 ఆసియా కప్ టోర్నమెంట్‌లలో దక్షిణ కొరియా 5 సార్లు విజయం సాధించగా, భారత్ 4 సార్లు ట్రోఫీని గెలుచుకుంది.





















