Boycott Laila: 'లైలా' సినిమా బాయ్ కాట్ చేయండి - 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్‌పై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్, సినిమాను పొలిటికల్ వివాదం చుట్టుముట్టిందా?
YCP targets Laila: 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్విట్టర్ వేదికగా ట్రెండ్ చేస్తున్నారు.

Boycott Vishwak's Laila Movie Trend On Twitter: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా' (Laila). ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్‌లో నటిస్తుండగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అయితే, ఆదివారం హైదరాబాద్‌లో మెగా మాస్ ప్రీ రిలీజ్ పేరుతో 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. దీంతో మూవీ టీంతో పాటు అభిమానులు సైతం ఫుల్ జోష్‌లో మునిగిపోయారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటీ నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. విశ్వక్ లేడీ గెటప్‌ను నెగిటివ్ లైట్‌లో చూపించారని పలు విమర్శలు వచ్చాయి. తాజాగా, ఈ సినిమాను మరో పొలిటికల్ వివాదం చుట్టుముట్టింది.
బాయ్ కాట్ 'లైలా'
'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి. సినిమాలో తన పాత్ర గురించి చెప్పిన పృథ్వీ.. పరోక్షంగా ఓ రాజకీయ పార్టీపై సెటైర్లు వేశారు. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయి.' అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండైరెక్ట్‌గా తమ పార్టీ గురించే కామెంట్స్ చేశారంటూ వైసీపీ శ్రేణులు, అభిమానులు పృథ్వీపై ఫైర్ అవుతున్నారు. బాయ్ కాట్ 'లైలా' (Boycott Laila) అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పృథ్వీ వ్యాఖ్యలపై చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా వివిధ వీడియోలతో ట్రెండ్ చేస్తున్నాయి. మరోవైపు, హీరో విశ్వక్ సేన్ సోమవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ వివాదంపై స్పందించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా ఫంక్షన్ లో సినిమా గురించి మాట్లాడకుండా ఇష్టమొచ్చిందో మాట్లాడి మళ్ళీ సినిమా వాళ్లు రాజకీయ నాయకులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఏడుపులు ఎందుకు ఏడవడం? #Laila @VishwakSenActor pic.twitter.com/npik7ydmbX
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) February 9, 2025
ఒకడి అతి వల్ల మీరు మాత్రమే కాదు..
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) February 9, 2025
మొత్తం మీ యూనిట్ కే దెబ్బ పడుతుంది
ఎంతోమంది కష్టాన్ని వృధా చెయ్యొద్దు..
మర్యాదగా వాడితో క్షమాపణ చెప్పించు @VishwakSenActor
లేకపోతే ఎవరు తట్టుకోలేని నష్టాన్ని చూస్తావ్ 👍#BoycottLailapic.twitter.com/6eF4WRHP9O
కాగా, నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ కీలక పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనకు మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి పలు సినిమా ఈవెంట్లలోనూ వైసీపీపై ఇండైరెక్ట్‌గా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. 'లైలా' సినిమాను పొలిటికల్ వివాదం చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. దీనిపై నటుడు విశ్వక్ సేన్ వివరణ అనంతరం ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందని అంతా భావిస్తున్నారు.
Also Read: అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేసిన చిరంజీవి.. హారర్ హిట్స్ ఇచ్చిన అమ్మాయికి పోలీస్ రోల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

