Indian Migrants: డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
Indian Migrants : డంకీ రూట్ కు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మార్గంలో వెళుతూ ఓ పంజాబీ యువకుడు గుండెపోటుతో మరణించాడు.

Indian Migrants : అమెరికాలో అక్రమవలసలకు సంబంధించిన వార్తలు ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మధ్యే అమెరికా తన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 104 మంది భారతీయులను వెనక్కి పంపిన సంగతిని మరువకముందే.. అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశంపై మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ పంజాబీ యువకుడు డంకీ రూట్ లో అమెరికాకు వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 33ఏళ్ల గుర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు.
ఈ విషయాన్ని గుర్ ప్రీత్ సింగ్ కుటుంబసభ్యులు ధృవీకరించారు. గుర్‌ప్రీత్ మూడు నెలల కిందట అమెరికా వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడని, ఈ ప్రయాణానికి చండీగఢ్‌కు చెందిన ఏజెంట్ బల్వీందర్‌సింగ్‌ను సంప్రదించి రూ. 16.5 లక్షలు చెల్లించాడని అతని సోదరుడు వెల్లడించాడు. అక్కడ పాకిస్థానీ ఏజెంట్ మహమ్మద్ కు బాధ్యతలు అప్పగించాడని, గుర్ ప్రీత్ మరణించిన తర్వాతే మహమ్మద్ పాకిస్థానీ అని తమకు తెలిసిందన్నారు. అనంతరం మరికొందరు వలసదారులతో కలసి పలు దారుల్లో అమెరికాకు బయల్దేరాడు.
గుర్ ప్రీత్ పనామా అడవి గుండా కొలంబియాకు బయల్దేరాడని, అతను ఇప్పటికే పాకిస్తాన్ ఏజెన్సీ నుండి రూ.18-20 లక్షలు తీసుకున్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే తమకు ఫోన్ చేసి గ్వాటమాలాలో ఉన్నట్టు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి గుర్ ప్రీత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారని, కారులో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. ఇది జరిగిన 5 -7 నిమిషాల్లోనే తన సోదరుడు చనిపోయినట్టు సమాచారమిచ్చారని గుర్ ప్రీత్ సోదరుడు తారాసింగ్ మీడియాకు వివరించాడు. తన సోదరుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.
ਵਿਧਾਨ ਸਭਾ ਹਲਕਾ ਅਜਨਾਲਾ ਦੇ ਕਸਬਾ ਰਮਦਾਸ 'ਚ 36 ਲੱਖ ਰੁਪਏ ਲਗਾ ਕੇ ਡੰਕੀ ਰਸਤੇ ਰਾਹੀਂ ਅਮਰੀਕਾ ਜਾ ਰਹੇ ਨੌਜਵਾਨ ਮੁੰਡੇ ਦੀ ਰਸਤੇ 'ਚ ਮੌਤ ਹੋ ਗਈ। ਮੈਂ ਸਾਰੇ ਪੰਜਾਬੀਆਂ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਗੈਰ-ਕਾਨੂੰਨੀ ਤਰੀਕੇ ਨਾਲ ਕਿਸੇ ਵੀ ਦੇਸ਼ ਵਿੱਚ ਨਾ ਜਾਓ ਅਤੇ ਜੇਕਰ ਤੁਸੀਂ ਕਰਜ਼ਾ ਲੈ ਕੇ ਇੰਨਾ ਪੈਸਾ ਇਕੱਠਾ ਕੀਤਾ ਹੈ ਤਾਂ ਇੱਥੇ ਪੰਜਾਬ ਵਿੱਚ… pic.twitter.com/XOcaFDqaro
— Kuldeep Dhaliwal (@KuldeepSinghAAP) February 9, 2025
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్రమంత్రి
గుర్ ప్రీత్ మరణవార్త తెలుసుకున్న పంజాబ్ రాష్ట్ర మంత్రి కుల్దీప్ సింగ్ దలివాల్ అతని కుటుంబాన్ని పరామర్శించారు. గుర్ ప్రీత్ మరణం విచారకరం. ఎవరైనా చట్టపరమైన అనుమతులు తీసుకుని మాత్రమే విదేశాలకు వెళ్లాలని, అక్రమ మార్గాలను అనుసరించడం ప్రమాదకరమని మంత్రి సూచించారు.
ఏంటీ ఈ డంకీ రూట్..?
విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్నే డంకీ రూట్ గా పిలుస్తారు. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. అంటే ఎలాంటి ప్లాన్ లేకుండా ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడం. ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, షిప్ కంటైనర్లు, వాహనాల్లో రహస్య కంపార్ట్ మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటిస్తూ చట్టవిరుద్దంగా ఓ దేశంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

