Gambhir Fight with Pitch Curator | పిచ్ క్యూరేటర్‌తో గొడవ పడిన గౌతమ్ గంభీర్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధం అవుతున్నాయి. టీం ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ క్యూరేటర్‌తో గొడవ పడినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ సమయంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కలుగచేసుకుని పిచ్ క్యూరేటర్‌ను కాస్త దూరంగా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ గంభీర్, క్యూరేటర్ మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ గొడవకు సంబంధించి బ్యాటింగ్ కోచ్ సితాషు ప్రెస్ మీట్ లో ఒక ప్రకటన చేసారు.
క్యూరేటర్ మొదట మా సపోర్ట్ స్టాఫ్ పై అరిచాడు. పిచ్ క్యూరేటర్ మమ్మల్ని 2.5 మీటర్ల దూరంలో ఉండమని చెప్పారు. మేం జాగర్లు ధరించాం. మీరు రబ్బరు స్పైక్‌లు ధరించి పిచ్‌ను చూస్తుంటే, దానిలో తప్పు ఏమీ లేదు. మైదానానికి ఎటువంటి నష్టం జరగలేదని మేం చెప్పాము. ఐస్ బాక్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ గొడవ జరిగింది. దీని కారణంగా గంభీర్ కోపంగా ఉన్నాడు. ది ఓవల్ క్యూరేటర్‌తో మాట్లాడటం ఎంత కష్టమో అందరికీ తెలుసు అని అన్నారు సితాషు. అయితే ఈ వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఇంకో ఫోటో కూడా వైరల్ అవుతుంది.
ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ 2025 మ్యాచ్ కు ముందు అదే పిచ్ పై క్యూరేటర్ తో పాటు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రాండన్ మెక్కళుమ్ నిల్చొని మాట్లాడుతున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది. అది కూడా మ్యాచ్ ప్రారంభానికి కు సర్రిగా రెండు రోజుల ముందు వాళ్లు ఆలా పిచ్ పై నిల్చొని మాట్లాడారు.
ఇప్ప్డుడు జరిగిన గొడవలో ... పిచ్ కు 2.5 మీటర్ల దూరంలో ఉన్నాం అని స్పష్టం చేసారు టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ స్పష్టం చేశారు కూడా. కానీ అటు పిచ్ క్యూరేటర్ కానీ ఇటు టీం ఇండియా కానీ ఒకరిపై మరొకరు ఇప్పటి వరకు కంప్లెయింట్ చేసుకోలేదు. చూడాలి మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో.





















