Nitin Gadkari: ఏపీకి రానున్న నితిన్ గడ్కరీ - వేల కోట్ల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Nitin Gadkari to visit Andhra Pradesh | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 2వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Andhra Pradesh News | అమరావతి: కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 2వ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీ ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ₹9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని సమాచారం. ఏపీ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిశారు. కానూరు- బందర్ రోడ్డు విస్తరణ, విశాఖపట్నం, విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణం, హైదరాబాద్- అమరావతి అనుసంధాన రోడ్డు, కర్నూలు-ఎమ్మిగనూరు రోడ్డు విస్తరణ సహా పలు అంశాలపై టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి గడ్కరీ వినతిపత్రాలు సమర్పించారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.






















