అన్వేషించండి
Tsunami Alert: సముద్రంలో సునామీ వచ్చినప్పటికీ షిప్‌లు , క్రూయిజ్‌లు ఎందుకు మునిగిపోవు? మునిగే ప్రమాదం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
Why Tsunami Does Not Sink Ship: సునామీ వచ్చినప్పుడు ఓడలు మునిగిపోవు. సముద్రంలో ఉన్న ఓడలకు ముప్పు ఉండదు...కానీ ఎప్పుడు ప్రమాదమో తెలుసా?
సముద్రంలో సునామీ వచ్చినప్పటికీ షిప్‌లు , క్రూయిజ్‌లు ఎందుకు మునిగిపోవు?ఎప్పుడు ప్రమాదం ఉంటుంది?
1/7

బుధవారం ఉదయం రష్యాలో భారీ భూకంపం సంభవించిన కారణంగా పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్, అమెరికా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు ఉన్నాయి మరియు కొన్ని ప్రాంతాల్లో పెద్ద అలలు కూడా కనిపించాయి. అయితే, ఓడ లేదా క్రూయిజ్ నౌక సముద్రంలో ఉన్నప్పుడు సునామీ వస్తే, అవి ఎందుకు మునిగిపోవు ? సునామీ వచ్చినప్పడు ఓడలు, క్రూయిజ్‌లలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు సురక్షితంగాఉంటారు? ఎప్పుడు ప్రమాదంలో మునిగిపోతారు? దీనివెనుక కారణం ఏంటో తెలుసా?
2/7

సునామీ వచ్చినప్పుడు ఓడలో ఉండేవారు సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు అనుకుంటారంతా. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అది ఓడ లేదా క్రూయిజ్ నౌక యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది అది మునిగిపోతుందా లేదా బయటపడుతుందా అని. ఏదైనా ఓడ సముద్రం మధ్యలో మునిగిపోవాలని లేదు.
3/7

ఓడ లోతైన సముద్రంలో అంటే తీరానికి చాలా దూరంలో ఉంటే సునామీలో మునిగిపోయే ప్రమాదం దాదాపు ఉండదు. సముద్రంలో సునామీ అలలు గంటకు వందల మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.
4/7

సునామీ అలల ఎత్తు 1 నుంచి 2 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. పెద్ద ఓడలను సముద్రపు ఇంత ఎత్తైన అలలను తట్టుకునేలానే తయారు చేస్తారు.
5/7

అదే సమయంలో కార్గో షిప్ లేదా పెద్ద క్రూయిజ్ నౌకల బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన నౌకలను అలలు కదిలించవచ్చు, కానీ వాటిని ముంచడం చాలా కష్టం.
6/7

ఓడలకు సునామీలు తీరానికి చేరుకున్నప్పుడు చాలా ప్రమాదకరంగా మారతాయి. ఎందుకంటే తీరాలలో అలల ఎత్తు 10 నుంచి 30 మీటర్ల వరకు పెరుగుతుంది.
7/7

అలాంటప్పుడు సునామీ యొక్క వేగవంతమైన అలలు దానిని ఢీకొట్టి పడగొట్టవచ్చు. అందుకే ఓడలు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు, అవి మునిగిపోయే ప్రమాదం తీరాల కంటే తక్కువగా ఉంటుంది.
Published at : 31 Jul 2025 09:23 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















