KKR Head Coach Chandrakant Pandit | KKR సంచలన నిర్ణయం
కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిట్ IPL 2026 కి ముందే జట్టును విడిచిపెట్టాడు. చంద్రకాంత్ పండిట్ IPL 2023కి ముందు KKR లో చేరారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మెంటర్ గౌతమ్ గంభీర్‌లతో కలిసి 2024 లో KKR IPL టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కానీ IPL 2025లో KKR ప్రదర్శన అంతంగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు టీంకు ఎంతో అవసరమైన కోచ్ కూడా టీంలో నుంచి బయటకు వచ్చేసారు. దాంతో KKR ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా KKR చంద్రకాంత్ టీంని విడుతున్నట్టుగా ప్రకటించింది.
KKR ఫ్రాంచైజి గెలుపులో కీలక పాత్ర పోషించే వెంకటేష్ అయ్యర్‌ను 23.75 కోట్లకు కొనడంలో పండిట్ కీలక పాత్ర పోషించారు. పండిట్ నాయకత్వంలో KKR మూడు సీజన్లలో 42 మ్యాచ్‌లలో 22 గెలిచింది. చంద్రకాంత్ పండిట్ చాలా మంది క్రికెటర్ల కెరీర్‌ను తీర్చిదిద్దాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని పనితీరును చూసి KKR అతన్ని జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించింది. చంద్రకాంత్ పండిట్ మార్గదర్శకత్వంలో KKR టైటిల్‌ను గెలుచుకోవడమే కాదు .. అత్యుత్తమ నెట్ రన్ రేట్‌ను కూడా సాధించింది. అలాంటి కోచ్ ను KKR ఎందుకు వదులుకుంది అంటూ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. చంద్రకాంత్ టీంను వీడడానికి కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.





















