Heavy Rains in Jammu Kashmir | జమ్మూ కాశ్మీర్ లో నదిలో పడిపోయిన బస్
జమ్మూ కాశ్మీర్ లో కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి చెరువులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కు సంబంధించిన బస్సు అదుపుతప్పి తావి నదిలో పడిపోయింది. జమ్ముకశ్మీర్ లోని గండేర్‌బల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐటీబీపీకి చెందిన జవాన్‌లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, ఆయుధాలు మాత్రమే ఉండటంతో ప్రాణ నష్టం తప్పింది.
బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ ప్రాంతానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన డ్రైవర్ ను బస్ లో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. నదిలో పడిపోయిన బస్సు తోపాటు ఆయుధాలను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.




















