Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్
''ప్రజారాజ్యం మారిపోయింది.. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది, జై జనసేన'' అన్నారు మెగాస్టార్ చిరంజీవి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రజారాజ్యం పార్టీపై చిరు మాట్లాడారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కామాక్షి ఓ కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదల కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, తాజాగా విడుదలైన ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో మెగా మాస్ ప్రీరిలీజ్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా మారింది
Chiranjeevi speech Laila pre release event: చిరంజీవి మాట్లాడుతూ... ''విశ్వక్ సేన్ నాన్నగారిని కరాటే రాజు అంటారు. 18 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం. ప్రజారాజ్యం టైమ్‌లో రాజకీయంగా నాతో ఉన్నారు. (ఆడియన్స్ ఈలలు, చప్పట్లతో హోరెత్తుతుండగా) జై జనసేన... ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఆ రోజున కరాటే రాజు పొలిటికల్‌గా నేను రావాలి, నేను ఎదగాలి అని చెప్పినప్పుడు వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ పరిస్థితులు ఇంకోలా మారిపోయాయి. అప్పటి నుండి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్లబ్బాయి విశ్వక్ సేన్ సినిమాల్లోకి వస్తున్నాడని చెప్పాడు. నేను ఒకసారి వాళ్లింటికి అయ్యప్ప పూజకు కూడా వెళ్లాను. అప్పుడు విశ్వక్ చిన్నవాడు అనుకుంటాను'' అని అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను చూస్తే తనకు గర్వంగా ఉంటుందని ఈ స్పీచ్‌లో మరో సందర్భంలో చెప్పారు.
విశ్వక్ సేన్ జెండా పాతాల్సిందే
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ... ''మరి సినిమాల వైపు ఎలా ఆకర్షితుడయ్యాడో తెలియదు కానీ.. తనకున్న టాలెంట్.. రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ఇలా ప్రతిభ కలిగిన వ్యక్తి విశ్వక్ సేన్. ఇంతటి ప్రతిభ కలిగిన వ్యక్తి ఖాళీగా ఇంట్లో కూర్చోలేడు. ఇండస్ట్రీకి రావాలి.. సత్తా చాటుకోవాలి, జెండా పాతాల్సిందే. ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మరింత ఎత్తుకు ఎదుగుతాడు. అభిమన్యుసింగ్, పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా అందరూ ఇందులో చాలా చక్కగా నటించారు. హీరోయిన్ ఆకాంక్ష చాలా గ్లామర్‌గా కనిపించింది. తెలుగు ఇండస్ట్రీ తరపున ఆమెకు స్వాగతం పలుకుతున్నాను. కామాక్షి ఇందులో చాలా మంచి పాత్ర చేసింది. ఆమెకు కూడా మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ద బెస్ట్..’’ అని అన్నారు.
Also Read: ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాంపౌండ్... బాలకృష్ణ, తారక్ అంటాడని విశ్వక్ ఫంక్షన్‌కు వెళ్లకూడదా? - చిరంజీవి
‘లైలా’ మరో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అవుతుంది
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికంతోటి, సంసార పక్షంగా మనం, మన కుటుంబం అని ఉంటున్నాం, కానీ మనలో అణగారిపోయినవి కొన్ని ఉంటాయి చూశారా.. ఆ కోరికలు మళ్లీ బయటపడ్డాయి. మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు. ఫ్రౌడగా ఉన్నాడు.. కానీ గ్లామర్ తగ్గలేదు. కస్సక్కున అనిపిస్తున్నాడు. విశ్వక్ సేన్ కాకుండా నిజంగా అమ్మాయి అయి ఉంటే.. గుండెజారి గల్లంతయ్యేదని అనిపించింది. అంత గ్లామర్‌గా ఉన్నాడు. నేనూ అమ్మాయిగా చేశాను. నరేష్ చేశాడు, రాజేంద్రప్రసాద్ చేశాడు.. ఈ సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అనను.. హిట్ గ్యారంటీ అంతే. మాస్‌గా, మొరటుగా, రగ్‌డ్‌గా ఉండే మనిషి.. నాజూగ్గా, నవనవలాడుతూ, పక్కనుంటే బుగ్గకొరికేయాలనేంతగా ఉంటే, కచ్చితంగా సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళతారు. రెండు రకాల పాత్రలలో విశ్వక్సేన్ అద్భుతంగా చేశాడు. కథాంశంలో దర్శకుడు రామ్ నారాయణ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోటి కామెడీగా ఉండేలా.. సినిమాను చక్కగా తెరకెక్కించాడని సాహు వాళ్లు చెబుతుంటే ఎక్స్‌లెంట్ అనిపించింది. ఈరోజున అది కావాలి. అనిల్ రావిపూడి తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మొన్న చూసినప్పుడు.. నేనేం లాజిక్కులు పట్టించుకోలేదు. ఆద్యంతం నవ్వుతూనే ఉన్నాను. అలాగే ఈ సినిమా కూడా ఆద్యంతం లాజిక్కుల ఆలోచన రాకుండా, బ్రెయిన్‌కి పని పెట్టకుండా.. కేవలం హృదయంతోటి ఈ సినిమా చూసేలా, ఎంజాయ్ చేసేలా రూపొందించి ఉంటారని నేను అనుకుంటున్నాను. విశ్వక్, రామ్ నారాయణ్‌లకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది'' అని అన్నారు.






















