Rajinikanth : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
Rajinikanth Emotional : గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో తలైవా రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు. మళ్లీ నటుడిగా, రజనీకాంత్‌లానే పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Rajinikanth Emotional Speech in IFFI Closing Ceremony In Goa : ఇంకో వంద జన్మలంటూ ఉంటే తాను మళ్లీ నటుడిగా రజనీకాంత్‌గా పుట్టాలని కోరుకుంటున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో తన మూవీ జర్నీని గుర్తు చేసుకుంటూ తలైవా ఎమోషనల్ అయ్యారు.
వంద జన్మలైనా మళ్లీ నటుడిగా...
సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల తన జర్నీ 10 లేదా 15 ఏళ్లుగానే అనిపించిందని చెప్పారు తలైవా. 'సినిమాల్లో 50 ఏళ్ల నా నటన 10 లేదా 15 ఏళ్లుగా అనిపించింది. ఇంకా 100 జీవితాలు ఉంటే నేను నటుడిగా రజనీకాంత్‌గా పుట్టాలని అనుకుంటున్నా. ఈ గౌరవం అంతా సినీ పరిశ్రమకు, ప్రజలకు... ముఖ్యంగా తమిళ ప్రజలు నన్ను బతికించే దేవుళ్లకే చెందుతుంది' అని అన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో తలైవా ఫ్యాన్స్, ప్రముఖులు అందరూ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
50yrs of acting in cinema felt like 10 or 15 yrs.. If there are 100 more janams are there, I would like to be born as an actor & #Rajinikanth..🔥 All this honour goes to Cinema Industry people & Mainly Ennai Vaazhaveikum Dheivangalana Tamil Makkal..😍pic.twitter.com/Z9CyfuwZuB
— Laxmi Kanth (@iammoviebuff007) November 28, 2025
Veteran actor @rajinikanth honoured with Lifetime achievement award and actor #Dharmendra remembered at star-studded closing ceremony of #IFFI2025 in Goa. #IFFI56 #IFFIGoa #InternationalFilmFestivalOfIndia #IFFI #IFFI56 #redcarpet @IFFIGoa @PIB_Panaji @MIB_India pic.twitter.com/WTSYobypbC
— All India Radio News (@airnewsalerts) November 29, 2025
అంతకు ముందు హోటల్‌కు వచ్చిన సూపర్ స్టార్‌కు హోటల్ సిబ్బంది, ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. డోలు కట్టుకుంటూ ఆయన ఎంట్రీ కోసం స్పెషల్ సంప్రదాయ డ్యాన్సులతో అభిమానులు సందడి చేశారు. రజనీ స్పీచ్, ఆయన ఎంట్రీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు దటీజ్ తలైవా... సూపర్ స్టార్ సూపర్ స్టారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రజనీ కాంత్ 5 దశాబ్దాల కాలంలో సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు.
ఇదే వేడుకలో రజనీ కుమార్తె ఐశ్వర్య సైతం ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆమె దర్శకత్వం వహించిన 'లాల్ సలాం' సినిమాలో రజనీ కీ రోల్ ప్లే చేశారు. ఈ సినిమా తెరకెక్కించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని... నాన్నే తనకు ధైర్యం ఇచ్చినట్లు చెప్పారు. కుమార్తెగానే కాకుండా ఓ దర్శకురాలిగా కూడా ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.





















